అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓటీపీ’. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. జాన్విక, ఆరోహి నారాయణ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ప్రమోదిని లీడ్ రొల్స్ లో యాక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
స్టోరీ విషయానికొస్తే..
అక్షయ్ (అనీష్), సన (ఆరోహి నారాయణ్) కాలేజ్ మేట్స్ . అక్కడ సన అక్షయ్ ను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. ఇక అనీష్ కు మంచి క్రికెటర్ అవ్వాలనేది గోల్. అనీష్ తండ్రి (రాజీవ్ కనకాల) ఒక పోలీస్ ఆఫీసర్. ఆయనకు ప్రేమ గీమా అంటే అసలు పడదు. అలాంటి కేసులను సీరియస్ గా తీసుకునిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అక్షయ్ కు లవ్ అంటే పడదనే సంగతి తెలుసుకున్న సన.. అతనికి వేరే విధంగా దగ్గరవుతుంది. అలా ఓ సందర్భంలో అక్షయ్ ను లవ్ చేస్తున్నట్టు ప్రపోజ్ చేస్తోంది. ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్షయ్.. సనను ప్రేమించాల్సి వస్తుంది.
అక్షయ్ ప్రపోజల్ తర్వాత .. సన అతన్ని లవ్ పేరుతో చీటికి మాటికీ వేధిస్తూ ఉంటుంది. దీంతో ఆ టెన్షన్ లో ఆటలో తీవ్రంగా గాయపడుతాడు. ఈ క్రమంలో అతన్ని ఫిజియోథెరిస్ట్ నక్షత్ర (జాన్విక) పరిచయం అవుతుంది. ఈ క్రమంలో ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. సన వల్ల కలుగుతున్న బాధలను చెప్పడంతో నక్షత్ర కూడా కన్విన్స్ అక్షయ్ ను ప్రేమిస్తుంది. అతని ప్రేమ గురించి తెలిసిన సన ఏం చేసింది. తాను అమ్మాయి ప్రేమలో ఉన్నాననే సంగతి తెలిసి అతని తండ్రి ఏం చేసాడు. చివరకు అక్షయ్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు. చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా మిగిలిన స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో హీరోలు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి వారే మెగాఫోన్ పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అనీష్ తనను హీరోగా ప్రమోట్ చేసుకోవడానికి డైరెక్టర్ అయ్యాడు. అంతేకాదు కొత్త తరహా ప్రేమ కథను ఎంచుకున్నాడు.ఈ టార్చర్ అంతా కామెడీగా చూపించాడు. మరోవైపు తండ్రికి ప్రేమ అంటే పడదు. ఈ క్రమంలో తన లవ్ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడనే భయం ప్రేక్షకుల్లో కలిగించాడు. మరో కథానాయికతో హీరో లవ్ విషయం తెలిసిన తర్వాత ఏం చేస్తుందనే విషయం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.
సెకండాఫ్ లో రెండు ప్రేమలు.. సమాంతరంగా చూపించడం అందులో ఫన్ చూపించే ప్రయత్నం దాదాపు సక్సెస్ అయిందనే చెప్పాలి. సెకండాఫ్ లో కామెడీ పండిస్తూనే ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ చేసి హ్యాపీ ఎండింగ్ ఇవ్వకపోవడమే ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్. క్లైమాక్స్ సాగదీత బోరింగ్ తెప్పిస్తోంది. ఓవరాల్ గా పెద్దగా తెలియని నటులు కావడం సినిమాకు మైనస్. హీరోగా దర్శకుడిగా డిఫరెంట్ లవ్ స్టోరీని ఎంచుకోవడం.. దానికి కామెడీ టచ్ తో మెప్పించడం విశేషం. ప్రమోషన్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బాగుండేది. పాటలు బోరింగ్ తెప్పించాయి.
నటీనటుల విషయానికొస్తే..
అనీష్.. అటు హీరోగా, దర్శకుడిగా. .రెండింటిని బ్యాలెన్స్ చేశాడు. నటనలో మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్ పెట్టే టార్చర్ భరించలేని లవర్ పాత్రలో మెప్పించాడు. ఇక బాయ్ ఫ్రెండ్ ను ముప్పుతిప్పలు పెట్టే పాత్రలో ఆరోహి నారాయణ్ నటన కాస్త ఓవర్ అనిపించినా.. ఓవరాల్ గా మెప్పిస్తుంది. యాక్ట్రెస్ గా మంచి భవిష్యత్తు ఉంది. ఫిజియోథెరపిస్ట్ పాత్రలో నటించిన జాన్విక నటన ఆకట్టుకునేలా ఉంది. రాజీవ్ కనకాల పోలీస్ పాత్రలో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
బ్యాటమ్ లైన్.. హిల్లేరియస్ ‘లవ్ ఓటీపీ’
రేటింగ్: 3/5
Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!
Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









