)
Constable: తెలుగులో వరుణ్ ఎన్ని చిత్రాలు చేసిన ఈయన్ని లవర్ బాయ్ గానే గుర్తు పెట్టుకున్నారు. తాజాగా ఈయన వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలతో పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘కానిస్టేబుల్’ చిత్రంతో పలకరించబోతున్నాడు. ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో జవానులు.. దేశం లోపల పోలీసులు ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. అంతేకాదు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కంటి రెప్పలా కాపాడుతున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమాలో కానిస్టేబుల్ పై రాసిన సాంగ్ రిలీజ్ వేడుకలో కొనియాడారు ఆర్.నారాయణ మూర్తి. అంతేకాదు పోలీసుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎన్.కే డైరెక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని బలగం జగదీష్ నిర్మిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించారు. మరో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం మరో విశేషం అని చెప్పాలి.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. "సమాజంలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమన్నారు. చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి అండగా నిలుస్తుంటారు. అలాంటి నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటను ఆలపించిన విధానం బాగుందున్నారు. వరుణ్ సందేశ్ కు ఇది మంచి కమ్ బ్యాక్ చిత్రం కావాలి. కెప్టెన్ అఫ్ ది షిప్ దర్శకుడు. ట్రైలర్, ఈ పాట చూస్తుంటే దర్శక, నిర్మాతల అభిరుచి మెచ్చుకోకుండా ఉండలేమన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. "నేను ఇంతవరకు నటించిన మూవీలకు భిన్నంగా ఈ చిత్రంలో తన పాత్ర ఉంటుందన్నారు. చక్కటి డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఆడియన్స్ ను అలరిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. యూనిట్ సమష్టి కృషికి ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణగా నిలిచిపోతుందన్నారు. అలాగే నా కెరీర్ కు మరో మలుపుగా ఈ చిత్రం నిలిచిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ..అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాము. నైజాంలో ప్రముఖ సంస్థ ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తున్నారు. దాదాపు 500 థియేటర్ల లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. "ట్రైలర్ కి వస్తున్న స్పందన చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్, ఒక లక్షకు పైగా లైక్స్ ఈ మూవీ రావడం మా సినిమాపై మాకు నమ్మకాన్ని పెంచాయన్నారు. తాజాగా విడుదల చేసిన ఎమోషనల్ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లొకేషన్ లోని ప్రజలు నిజమైన సన్నివేశం అనుకుని కన్నీరు కార్చారన్నారు. సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఇలాంటి చిత్రాలు రావాలని అందరూ కోరుకునేవిధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.