గత కొన్నేళ్లుగా మన దర్శకులు 1980, 90ల ప్రేమకథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు రాజేష్ చికిలే నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మధురం’ . మరి ఈ సినిమా నిజంగా మెమరబుల్ లవ్ స్టోరీ మెప్పించిందా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
రాజమండ్రిలోని ఆత్రేయపురంలో ఆర్సీఎం స్కూల్లో 10వ తరగతి చదివే మధు (వైష్ణవి సింగ్), 9వ తరగతి చదివే రామ్ (ఉదయ్ రాజ్) ను ప్రేమిస్తుంది. ఆ తర్వాత రామ్ కూడా ప్రేమిస్తాడు. 10వ తరగతి తర్వాత మధు పై చదువుల కోసం వేరే ఊరుకు వెళుతుంది. అయితే.. 9వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చిన రామ్ మాత్రం మధు ప్రేమలో పడి చదవును నిర్లక్ష్యం చేసి ఆమె చదువుకుంటున్న కాలేజీకి వెళుతూ మధును కలుస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో మధు.. రామ్ ప్రేమను తిరస్కరిస్తుంది. ఆ తర్వాత రామ్ ఆమెను మరిచిపోలేక పోతుండు. ఈ క్రమంలో మధు, రామ్ ఇద్దరు చివకు కలిసారా.. తమ ప్రేమను మధురాతి మధురంగా మార్చుకున్నారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో ఇలాంటి హృద్యమైన ప్రేమకథలు ఎన్నో వచ్చాయి. దర్శకుడు రాజేష్ చికిలే మాత్రం ఈ కథను 90ల నేపథ్యంలో స్కూల్ డేస్ లవ్ ను ఎంతో హృద్యంగా తెరపై ఆవిష్కరించాడు. కొన్ని సీన్స్ చూస్తే రవితేజ యాక్ట్ చేసిన ‘ఆటోగ్రాఫ్ స్వీట్ మెమెరీస్’ సినిమాను గుర్తుకు తెస్తాయి. ముఖ్యంగా మెచ్చురిటీ లేని స్కూల్ వయసులో ఇద్దరి మధ్య ప్రేమ.. అది కూడా 10వ తరగతి అమ్మాయితో 9వ తరగతి అబ్బాయి అనే ప్రేమ కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో, హీరోయిన్ల ప్రేమ ఆ నేపథ్యంలో వచ్చే సీన్స్ అక్కడక్కడ ప్రేక్షకులను నవ్వులు తెప్పిస్తాయి. కొత్త నటీనటులతో మంచి నటనే రాబట్టుకొన్నాడు దర్శకుడు. ముఖ్యంగా రాజమండ్రిలోని ప్రకృతి అందాలను సినిమాలో చూపించాడు. నగరంలోని రణగొణ ధ్వనులకు దూరంగా పూర్తి పల్లెటూరు అందాలను తెరపై చూపించాడు. ఈ సినిమా కథ మొత్తాన్ని పూర్వ విద్యార్ధుల గెట్ టుగెదర్ లో ఫ్లాష్ బ్యాక్ లో నడిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. చివర్లో మధు పెళ్లి చేసుకుందని తెలియగానే.. హీరో చెప్పే డైలాగులు హర్ట్ ను టచ్ చేస్తాయి. ఇక హీరోయిన్ తో హీరో తండ్రి.. తన కొడుకు జీవితం నాశనం చేయోద్దు అని చెప్పే సీన్ బాగుంది. చదువుకునే వయసులో ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దనే సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. జీవితంలో చదవుకొని ప్రయోజకులు అయిన తర్వాత ప్రేమ, పెళ్లి వంటి అంశాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా ఓ మాస్టరు ఓ విద్యార్థి స్కూలుకు రాకపోతే అతని భవిష్యత్తు అంధకారం అవుతుందనే విషయాన్ని చెప్పించడం బాగుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చినట్టే ఇచ్చిన సుఖాంతం చేసాడు. సినిమాకు మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ ఈ సినిమాను ఓ అరగంట నిడివి తగ్గిస్తే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
ఉదయ్ రాజ్ కొత్త నటుడు అయినా.. స్కూల్ విద్యార్ధిగా.. యువకుడిగా రెండు వేరియేషన్స్ లో చక్కని నటన కనబరిచాడు. రెండు అనే కంటూ మొత్తంగా మూడు వేరియేషన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ లో చక్కటి నటన ప్రదర్శించాడు. మధు పాత్రలో నటించిన వైష్ణవి సింగ్ తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా స్కూల్ విద్యార్ధిని ఆమె నటన బాగుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలను పండించింది. మంచి నటి అయ్యే ఛాన్స్ ఉంది. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన తులసి.. హీరో ఫ్రెండ్స్ గా నటించిన వాళ్లు తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. ‘మధురం’.. ఆకట్టుకునే హృద్యమైన ప్రేమకథ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..
రేటింగ్ :2.75/5
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









