Mahesh Daughter: బ్రాండింగ్ లో తండ్రిని మించిపోతున్న సితార.. PMJ జ్యువలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో ప్రిన్సెస్ సందడి..

Mahesh Daughter Sitara Ghattameni: మహేష్ బాబు సితార.. ఇపుడు  బ్రాండింగ్ విషయంలో తండ్రి మహేష్ బాబుకు పోటీ ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు కూతురుగా కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో సందడి చేసిన సితార.. తాజాగా పలు ప్రకటనలకు ప్రచార కర్త పనిచేస్తోంది. తాజాగా PMJ జువలర్స్ పంజాగుట్టలో 40 షోరూమ్ ను సితార చేతులు మీదుగా ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2025, 10:31 PM IST
Mahesh Daughter: బ్రాండింగ్ లో తండ్రిని మించిపోతున్న సితార.. PMJ జ్యువలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో ప్రిన్సెస్ సందడి..

Mahesh Daughter Sitara Ghattamaneni:  ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పంజాగుట్టలో  PMJ జువలర్స్ 40వ షోరూమ్ అట్టహాసంగా ప్రారంభమైంది.  మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితారా (Sitara Ghattamaneni) ఈ షోరూమ్ ను ప్రారంభించారు. 60 యేళ్ల  క్రితం 1964లో ప్రారంభం అయిన పీఎంజే జ్యవలర్స్.. టికి ప్రజల మన్ననాలతో విజయవంతగా దూసుకెళ్తుంది. గత 6 దశాబ్దాలుగా ప్రజలకు నాణ్యమైన బంగారు ఆభరణాలను అందిస్తూ కష్టమర్స్ నమ్మకాన్ని చూరగొంది.   

Add Zee News as a Preferred Source

PMJ ఆభరణాల షోరూమ్ ను  సితారా ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. 1964 నుంచి మేము అత్యంత ఆదరణీయ స్వర్ణకారులుగా ఉంటూ వినియోగదారుల ఆనందంలో  భాగస్వామ్యం అవడం హ్యాపీగా ఉందన్నారు.  ఈ షోరూమ్ లో మహిళలకు కావాల్సిన అన్ని రకాల ఆభరణాలు దొరుకుతాయని చెప్పారు. ఈ 40వ అతిపెద్ద PMJ స్టోర్, 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, విశాలమైన పార్కింగ్ స్థలంతో నిర్మించారు. సితార విషయానికొస్తే.. తండ్రి మహేష్ బాబుతో రీసెంట్ పలు ప్రకటనలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది.

మహేష్ బాబు విషయానికొస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ అడ్వెంచర్ తరహాలో నిర్మించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ద్విపాత్రాభియం చేయనున్నారు.ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. 

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News