)
Mr Ramu: ‘మిస్టర్ రాము’ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము స్వయంగా హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. అజయ్ కౌండిన్య డైరెక్ట్ చేశారు. త్వరలో "మిస్టర్ రాము" సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ ను భాగ్యనగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన మీ అందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ఇంతమంది వచ్చారంటే మీరంతా సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తన రోల్ గుర్తుండి పోతుందన్నారు. మిస్టర్ రాము చిత్రంలో అజయ్ ఘోష్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందన్నారు. ఈ సినిమాకు హృదయ్ ముగ్దల్ సంగీతం ప్రేక్షకులు హమ్ చేసుకునేలా ఉన్నాయన్నారు. చరణ్ కెమెరా పనితనం కూడా హైలైట్ గా నిలవనుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ - నాకు హీరోగా నటించాలని డ్రీమ్ ఉండేది. దర్శకుడు అజయ్ కౌండిన్య నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు కథ నచ్చి తప్పకుండా చేద్దామని నేను ప్రొడ్యూస్ చేశానన్నారు. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ గా నటించనన్నారు. భాషాలో రజినీకాంత్.. రౌడీ అల్లుడులో చిరంజీవి తరహాలో ఉంటుందున్నారు. మిస్టర్ రాము తో పాటు నేను, డైరెక్టర్ అజయ్ కౌండిన్య కాంబినేషన్ లో మరో 9 చిత్రాలు రాబోతున్నాయి. మొత్తం మా కాంబినేషన్ లో 10 సినిమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మిస్టర్ రాము సినిమా రిలీజైన వెంటనే మా కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తామన్నారు. మాకు సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు, సన్నిహితులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుందున్నారు. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లో ఆయన నటన ప్రేక్షకులకు గుర్తుండి పోతుందన్నారు. పుష్ప సినిమా విలన్ అజయ్ ఘోష్ మా మీద అభిమానంతో ఈ చిత్రంలో విలన్ గా నటించారు. అలాగే జబర్దస్త్ అప్పారావు అడిగిన వెంటనే నటించేందుకు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సినిమా ప్రతి విషయంలో నిర్మాతగా హీరోగా రాము సపోర్ట్ మరవలేనిదన్నారు. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండటం లేదు. చిన్న చిత్రాలు కూడా వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాలి. అలా పేరు తెచ్చుకునే సినిమాల్లో దర్శకుడిగా నా చిత్రాన్ని కూడా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
నటి అవంతిక మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో నేను ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉన్నారు. నేను చేసిన స్పెషల్ సాంగ్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు.
హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో డైరెక్టర్ అజయ్ నాకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం హ్యాపీగా ఉందున్నారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.
మ్యూజిక్ డైరెక్టర్ హృదయ్ ముగ్దల్ మాట్లాడుతూ - మిస్టర్ రాము చిత్రంలో సాంగ్స్ కంపోజ్ చేయడమే కాదు పాటలు కూడా రాశాను. ప్రేక్షకులకు ఈ మూవీ పాటలు తప్పకుండా గుర్తుండి పోతాయన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.