రివ్యూ: నారి(Naari)
నటీనటులు : ఆమని, వికాస్ వశిష్ఠ, కేదార్ శంకర్, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, ప్రమోదినీ, తదితరులు
సంగీతం : వినోద్ కుమార్ విన్ను
సినిమాటోగ్రఫీ : వి రవికుమార్, భీమ్ సాంబ,
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుల్లపల్లి
నిర్మాత : శ్రీమతి శశి వంటిపల్లి
దర్శకత్వం : సూర్య వంటిపల్లి
తెలుగులో శ్రీమతి ఒక బహుమతి, ఆడదే ఆధారం, అమ్మ రాజీనామా వంటి పలు ఉమెన్ సెంట్రిక్ నేపథ్యంలో చిత్రాలు వచ్చాయి. అందులో మెజారిటీ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ కోవలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నారి’ సినిమాను థియేట్రికల్ గా విడుదల చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ
భారతి(ఆమని) ఉపాధ్యాయులరాలు కథ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. భారతి పాత్రలే ఒకటే కానీ.. అందులోని పాత్ర నేటి సమాజంలోని సగటు స్త్రీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె తన జీవితంలో తండ్రి, భర్త, కుమారుడు నుంచి ఎలాంటి ఇబ్బందులను ధీరోదాత్తురాలిగా ఎలా ఫేస్ చేయగలిగింది. కూతురుగా.. భార్యగా.. తల్లి.. చెల్లిగా ఆమె ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసింది. చివరకు ఆమె జీవితంలో ఏం జరిగిందనేదే ‘నారి’ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
నగరంలో జరిగిన ఓ యువతి మానభంగం ఘటనతో ఈ సినిమాను స్టార్ట్ చేసాడు దర్శకుడు. మన దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఎక్కడో ఒక చోట రేప్ కు గురవుతుంది. అందులో మహిళలు ఎక్కువగా తమకు తెలిసిన వాళ్ల చేతిలోనే ఇలాంటివి ఎదుర్కొంటున్నారు. చిన్నపుడు తండ్రి.. అన్న, తమ్ముడు.. పెళ్లైన తర్వాత భర్త.. కుమారుడు పుట్టిన తర్వాత అతని చేతిలో ఎన్నో ఇబ్బందులను ఈ సినిమాలో చూపెట్టాడు దర్శకుడు. అయితే.. మంత్రి కుమారుడు యువతిని మాన భంగం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భారతి (ఆమని)కథను లాయర్ శారద (ప్రగతి) చెప్పడంతో ఈ సినిమా స్టోరీ మొదలవువతోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ముఖ్యంగా తండ్రి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటుంది భారతి. అలా ప్రేమించిన వాడే చేతిలో మోసానికి గురవుతుంది భారతి. అమ్మాయిల కుటుంబ బలహీనతను వాడుకుంటున్న ఎంతోమంది అబ్బాయిలకు నిదర్శనం వికాస్ చేసిన ఆనంద్ పాత్ర. ప్రేమించినవాడితో మోసపోయిన భారతి ఏం చేసింది అనేది డైరెక్టర్ సూర్య ఒక కొత్త తరహాలో అద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. మగవాళ్లకు మంచితనం పనికి రాదని, వారిని చట్టం ముందు దోషిగా నిలబెట్టిన భారతి తెగువను చూసి ప్రతి ఒక్క మహిళ తముకు తాము కనెక్ట్ అవుతారు. చివరకు తన కొడుకే తప్పు చేసినా శిక్షిస్తుంది భారతి. తన బిడ్డమీద ప్రేమ కంటే సాటి అమ్మాయికి జరిగిన నష్టమే భారతిని ఎక్కువ బాధపెడుతుంది.
మొత్తంగా తప్పు చేసిన వాడు తండ్రైనా.. భర్తైనా.. కుమారుడైన ఒదిలి పెట్టని ఓ మహిళా జీవితమే నారీ మూవీ. తెలుగులో వచ్చిన వుమెన్ సెంట్రిక్ మూవీస్ లో నారి మూవీ గుర్తుండి పోతుంది. మొత్తంగా ప్రస్తుతం మన సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాత్యాలను ఈ సినిమాలో ప్రస్తావించాడు దర్శకుడు. జాతీయ అవార్డు సాధించే అన్ని అర్హతలు ఈ సినిమాకున్నాయనే చెప్పాలి. సమాజానికి మంచి చెప్పి, ప్రేక్షకులను గొప్ప మార్గంలో నడిపించే స్ఫూర్తి నింపే నారి లాంటి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత, దర్శకుల గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.
ఇలాంటి అరుదైన ప్రయత్నం చేసే మేకర్స్ కు ప్రోత్సాహం లభిస్తేనే మరిన్ని ఇలాంటి మంచి చిత్రాలు వస్తాయి. ఈ సినిమాలో నిర్మాణ విలువలు.. సందర్భానుసారంగా ఆర్ఆర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని ఏదో పాత్రను ఈ సినిమాలోని క్యారెక్టర్ కనబడుతుంది.
నటీనటుల విషయానికొస్తే..
సీనియర్ నటి ఆమని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎస్సెట్ అని చెప్పాలి. మిగతా నటీనటులంతా ఈ చిత్రానికి పిల్లర్స్ లా నిలిచారు.
పంచ్ లైన్.. మహిళా శక్తిని చాటే ‘నారి’ భేరి
రేటింగ్ : 2.75/5
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









