మూవీ పేరు: ‘నిశ్శబ్ద ప్రేమ’
నటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, నిహారిక పాత్రో, హరీశ్ పెరడి, వియాన్ తదితరులు
ఎడిటర్: మదన్.జి
సంగీతం: జుబిన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: యువరాజ్.M
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
బ్యానర్: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
నిర్మాత: కార్తికేయన్. S
దర్శకత్వం: రాజ్ దేవ్
విడుదల తేదీ: 23 మే, 2025
ప్రెజెంట్ జనరేషన్ లో మంచి కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఓటీటీలు వచ్చిన తర్వాత వివిధ భాషల్లోని చిత్రాలను ప్రేక్షకులు చూడటం మొదలుపెట్టారు. అందులో థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రమే ‘నిశ్శబ్ద ప్రేమ’. శ్రీరామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సినిమా ఫస్ట్ సీన్ లోనే (ప్రియాంక తిమ్మేష్)ను ఆమె ఇంట్లోనే ఓ ముసుగు మనిషి చంపడానికి ట్రై చేస్తుంటాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బయటకు పరుగెడుతూ యాక్సిడెంట్ కు గురవుతోంది. ఆ క్రమంలో ఓ వ్యక్తి ఆమె ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తాడు. తలకు బలమైన గాయం కావడంతో గతం పూర్తిగా మరిచిపోతుంది. ఇక తనని హాస్పిటల్ లో చేర్పించిన అతన్ని ఆమె భర్తగా పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్లి ఆమె బాగోగులు చూసుకుంటాడు. ఈ లోగా తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన కమిషనర్ ఎడ్వర్డ్ (హరీష్ పెరడి)కి సంధ్య ఓ హంతకుడి దగ్గర ఉందని తెలుసుకుంటాడు.అసలు సంధ్యను విఘ్నేష్ తన ఇంటికి ఎందుకు తీసుకెళ్లాడు. సంధ్య అతని చెర నుంచి ఎలా తప్పించుకుంది. అసలు విఘ్నేష్ ఎవరు ? రఘు ఎవరు ? వీళ్లిద్దరికి సంధ్యతో ఉన్న సంబంధం ఏమిటి ? ఈ క్రమంలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా (నిహారిక పాత్రో) రోల్ ఏమిటి ? అసలు సంధ్యను ఎవరు చంపాలనుకున్నారు ? వారి మోటివ్ ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు ఈ సినిమాను స్పీడ్ గా ఎక్కడా ల్యాగ్ చేయకుండా వడి వడిగా సినిమా కథలోకి లాక్కెల్లడంలో సక్సెస్ అయ్యాడు. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు పాటలనేవి పంటి కింద రాయిలా ఉంటాయి. దర్శకుడు ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టి కేవలం సందర్భోచితంగా రెండే రెండు పాటలను పెట్టాడు. ఒక మహిళను చంపానులనుకునే వ్యక్తి ఎవరు ? ఎందుకు ఆమెను టార్గెట్ చేసాడు తదితర అంశాలను సినిమా చివరి వరకు ఉత్కంఠ కలిగించేలా తెరకెక్కించాడు. సినిమాలోని ట్విస్టులు కూడా ఆకట్టుకునే విధానంగా ఉన్నాయి. దర్శకుడు టెక్నికల్ గా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు. ఓ స్టార్ సినిమా చూస్తున్నంత ఫీల్ తెచ్చాడు. దర్శకుడిగా తన గట్స్ ఏంటో చూపించాడు. ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో అవనసర కామెడీ.. కథతో సంబంధం లేని పాత్రలను పూర్తిగా పక్కన పెట్టి ఆడియన్స్ ను ఎంగేజ్ చేసాడు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ తన పనిని చక్కగా చేసాడు. డబ్బింగ్ సినిమా అయినా.. ఎక్కడా తేడా లేకుండా స్ట్రెయిట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ నటన ఆకట్టుకుంటుంది. ఆయనలో ఎంత మంచి యాక్టర్ ఉన్నాడో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అన్ని రకాల ఎమోషన్స్ ను పండించాడు. ఇలాంటి పాత్రలు శ్రీరామ్ కు కొత్త కాదు. ప్రియాంక తిమ్మేష్ పాత్రపైనే సినిమా కథ అంతా నడుస్తోంది. గృహిణిగా చక్కటి అభినయం ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో నటించిన నిహారిక పాత్రో తన యాక్టింగ్ తో మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
రేటింగ్:2.75/5
ఇదీ చదవండి: ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









