Tollywood: టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక దొరకదు.అలా టాలెంట్ ఉండి వాళ్ల ప్రతిభను నిరూపించుకునే వాళ్ళ కోసమే సంస్థ పీజే ప్రొడక్షన్స్ నెలకొల్పబడింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పిజే ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని కంటెంట్ లను ప్రదర్శించారు. వాటిలో మొదటిది మీరా పర్వం. స్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం ఒక ఫీచర్ ఫిల్మ్ గా చాలా చక్కగా ఉంది. అలాగే మరో రెండు షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడ ప్లే చేయారు.
ఇక రాకీ నాగ సాయి దర్శకత్వం వహించిన ఫేడెడ్, గోపీ చంద్ ఎం దర్శకత్వం చేసిన కలలో రాకుమారి సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడ ప్రదర్శించారు. ఈ మూడు షార్ట్ ఫిలిమ్స్ లో ఎంతో ప్రతిభావంతులైన వారి టాలెంట్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ మాట్లాడుతూ నిర్మాత ప్రవీణ్ జోలు సపోర్ట్ వల్లనే వీటిని ఇంత బాగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రవీణ్ జోలు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి కంటెంట్ ఇవ్వడమే తమ ఉద్దేశం అన్నారు. దానికోసం ఎంతైనా కష్టపడతామని చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో తమ సంస్థ నుండి ఒక చిత్రం విడుదల కాబోతుందన్నారు. ఆ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
ఆ చిత్రానికి స్వయానా ఈ షార్ట్ ఫిలిమ్స్ నిర్మాత..ప్రవీణ్ జోలు గారే రచనా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. చిత్ర టీజర్ ను ఈ కార్యక్రమం సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ మూవీ టీజర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందన్నారు. ఇంస్టాగ్రామ్ లో మీకు అందుబాటులో ఉంటుందని మీరు మీ స్టోరీస్ అక్కడ షేర్ చేయొచ్చని ప్రవీణ్ జోలు ఈ సందర్భంగా తెలియజేసారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









