Premaku Jai Review: 'ప్రేమ‌కు జై' మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

Premaku Jai movie Review: తెలుగులో రియల్ ఇన్సిడెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో రా రియల్ లవ్ స్టోరీ ‘ప్రేమకు జై’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2025, 07:07 PM IST
 Premaku Jai Review: 'ప్రేమ‌కు జై' మూవీ రివ్యూ.. మెప్పించిందా..!

టెక్నికల్ గా వరల్డ్ ఎంత అభివృద్ధి సాధిస్తున్నా కూడా ఇంకా కులాల ముసుగులో సమాజం తలదించుకునేలా పరువు హ‌త్య‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.   తల్లిదండ్రుల అభిమతానికి  వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకోవాల‌నుకున్న లేదా చేసుకున్న చాలా మంది ఏటా వీటికి బలవుతూే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల‌లో నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో జరుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో తాజాగా తెలుగులో వచ్చిన మరో చిత్రం ‘ప్రేమకు జై’. ఈ రోజు విడుదైలన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Add Zee News as a Preferred Source

క‌థ‌ విషయానికొస్తే..
జై (అనిల్ బురుగాని) హీరో చిరంజీవికి వీరాభిమాని. చిన్నప్పటి నుంచి హీరో కావాలని కలలు కంటూ ఉంటాడు.  ఇక అదే ఊరుకు చెంది.  ప్రేమ(జ్వలిత) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.  అయితే లవ్ కు జ్వలిత తండ్రి వ్యతిరేకిస్తాడు. ఈ నేపథ్యంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న  జై, జీవితంలో విజయం సాధించిన తర్వాత కానీ ప్రేమను పెళ్లి చేసుకుంటాడనని ప్రతిజ్ఞ చేస్తాడు.  అంతేకాదు సామాజిక కట్టుబాట్లను సవాల్ చేస్తాడు. ఈ క్ర‌మంలో ఏం జరిగింది.. చివరకు హీరో, హీరోయిన్లు తమ ప్రేమను గెలిపించుకున్నారా లేకపోతే.. సామాజిక కట్టుబాట్లకు బలైపోయారా అనేదే ఈ సినిమా స్టోరీ.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

నిజానికి పరువు  దక్కుతుందనే పేరుతో చేసే హత్యలవల్ల పరువు దక్కడం అటుంచి ఉన్న పరువు పోవడం మనం చూస్తూనే ఉన్నాము.  అంతేకాదు ఇలాంటి హత్యలను చేసిన వాళ్లకు  హంతకులు అనే ముద్ర పడటం తప్ప మరోటి ఉండవు. ఇలాంటి బరువైన సందేశాన్ని సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు శ్రీనివాస్ మల్లం.  డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది తెరపై ఆవిష్కరించాడు. నేటి యూత్ తల్లిదండ్రులకు ముఖ్యంగా కులం, మతం అంటూ గీటు గీసుకునే తల్లిదండ్రులకు కనువిప్పు కలిగేలా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ త‌రం యువ‌త‌, వారి త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం ఇది. ఈ సినిమాను దర్శకుడు పూర్తి గ్రామీణ నేపథ్యంలో అద్భుతంగా తీర్చిదిద్దాడు. మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

న‌టీన‌టుల విషయానికొస్తే..
హీరోగా న‌టించిన అనిల్ బురగాని త‌న పాత్ర‌కు న్యాయం చేసాడు. నటుడిగా మంచి కెరీర్ ఉంది. పాటలు, డాన్సులు, ఫైట్స్ లో మంచి ఈజ్ చూపించాడు. ఇక హీరోయిన్ జ్వలిత నటన క్యూట్ గా ఉంది.  ఇక విల‌న్ పాత్ర‌లో భాస్క‌ర్ దుబ్బాక యాక్టింగ్ బాగుంది.  సినిమాకు కీ రోల్ పోషించాడు. ఇక ఆనంద్, స‌ద్దామ్, మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టులు త‌మ పరిధి మేరకు నటించారు.

రేటింగ్:  2.75/5

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News