Premistunnaa Movie Review: ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ.. న్యూ ఏజ్ లవ్ స్టోరీ మెప్పించిందా..!

Premistunnaa Movie Review: తెలుగులో ప్రేమ కథలు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అలనాటి దేవదాస్ నుంచి ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో ప్రేమకథలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలున్నాయి. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్రేమిస్తున్నా. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. 

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 8, 2025, 07:50 AM IST
Premistunnaa Movie Review: ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ.. న్యూ ఏజ్ లవ్ స్టోరీ మెప్పించిందా..!

స్వాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమిస్తున్నా’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్,  టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాలో ఏదో ఉంది అనిపించేలా చేశారు. మరి ఈ ఫ్రైడే ఆడియన్స్ జడ్జిమెంట్ కోసం థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే.. 
కథానాయకుడు (సాత్విక్ వర్మ) తొలి చూపులోనే కథానాయికను (ప్రీతి నేహా) లవ్ లో పడతాడు. తన ప్రేమను అందరిలా రొటీన్  కాకుండా వెరైటీగా ఎక్స్ ప్రెస్ చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో అతను షాకింగ్ ప్రపోజల్ చేస్తాడు ? దానికి కథానాయిక ఎలా రెస్పాన్స్  అయింది. ? ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. వీళ్లిద్దరు ప్రేమించుకోవడంతో ఇద్దరి ఫ్యామిలీల్లో ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేశారు. ? చివరకు వీరి కథ సుఖాంతం అయిందా లేదా  మిగతా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

అబ్బాయిని చూసి అబ్బాయి తొలి చూపులోనే ప్రేమలో పడటం వంటివి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ ఇందులో హీరో హీరోయిన్ తో రొమాన్స్ చేయాలని ఉందని ప్రపోజ్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. దర్శకుడు ఈ పాయింట్ చుట్టే తన కథను అల్లుకున్నాడు. ప్రస్తుతం ప్రేమికుల మధ్య రొమాన్స్ తో పాటు శృంగారం కామన్ అయింది. ఈ పాయింట్ ను కాస్త ఘాటుగానే దట్టించాడు దర్శకుడు. అయితే ప్రేమలో .. శృంగారం అనేది కామనే అనే పాయంట్ ను చూపించాడు దర్శకుడు. డైరెక్టర్ ఏ అబ్బాయి అయినా.. అమ్మాయిని ప్రేమించడం వెనక ఉన్న మోటివ్ చూపించాడు. ఇక దాన్ని చుట్టు రాసుకున్న  కథ, కథనం ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. 

ఇక స్టోరీని ముందుకు వెనక్కి అలా ఫాస్ట్, ప్రెజెన్స్ లో చూపించడం బాగుంది. హీరో ఎందుకు హీరోయిన్ తో రొమాన్స్ కోరకున్నాడనే అంశమే ఈ సినిమాకు మెయిన్ పాయింట్ అని చెప్పాలి.  ఇక  కథానాయిక కూడా  రొమాన్స్‌ ఒప్పుకోవడంతో స్క్రీన్ ప్లే పరుగులు పెట్టించాడు. తర్వాత ఏం జరిగింది ? ఇద్దరి మధ్య అపోహలు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కొన్ని ట్విస్టులు ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా చేశాడు. నిజమైన ప్రేమ కథ హాట్ హాట్ గా బోల్డ్ గా చూపించడం అర్జున్ రెడ్డి నుంచి స్టార్ట్ అయింది. ఇపుడు అదే తరహాలో కాస్త వెరైటీగా చూపించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. 

ఫస్టాఫ్ కామెడీతో ఎంటర్టేనింగ్ గా తెరకెక్కించాడు. సెకండాఫ్ ఎమోషనల్ గా సాగిపోతుంది. కొడుకును కాపాడేందుకు వాళ్ల అమ్మ చేసే ప్రయత్నాలు.. అమ్మాయి ప్రేమ కోసం తాపత్రయ పడటం భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగిపోతుంది. తనది నిజమైన లవ్ అని తెలుసుకొని హీరో తీసుకునే నిర్ణయం.. ముఖ్యంగా ప్రేమకు, కామానికి ఉన్న తేడా ఏమిటనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కథను కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువులు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. పాటలు సందర్భోచితంగా ఉన్నాయి. 

నటీనటుల విషయానికొస్తే.. 

బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సాత్విక్ వర్మ ఇందులో హీరోగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అనుభవంతో పలు సన్నివేశాలను ఎంతో ఈజ్ తో చేశాడు. ఆయన క్యారెక్టర్ అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 తరహాలో సాగుతుంది.  ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. ప్రీతి నేహా కూడా ఎక్కడా మొహమాటం లేకండా బోల్డ్ లేడీ క్యారెక్టర్ లో యూత్ కు దగ్గరైంది. యాక్టింగ్ లో మెప్పించే ప్రయత్నం చేసింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

పంచ్ లైన్.. ‘ప్రేమిస్తున్నా’.. యూత్ ను ఆకట్టుకునే బోల్డ్ లస్ట్ స్టోరీ 

రేటింగ్..3/5

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News