Raa Raja Movie Review: రా రాజా మూవీ రివ్యూ.. హార్రర్ థ్రిల్లర్ మెప్పించిందా..!

Raa Raja Movie Review: బీఎస్ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రా రాజా’. హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2025, 05:39 PM IST
Raa Raja Movie Review: రా రాజా మూవీ రివ్యూ.. హార్రర్ థ్రిల్లర్ మెప్పించిందా..!

తెలుగు సహా ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఎన్నో హార్రర్ చిత్రాలొచ్చాయి. కానీ ‘రా రాజా’ మూవీ మాత్రాన్ని ఇపుడొస్తోన్న చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బీఎస్ ప్రసాద్. ఒక రకంగా పాత్రల ముఖాలను చూపించకుండా.. సినిమా మొత్తాన్ని తెరకెక్కించడమనేది ఇప్పటి వరకు లేదు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే..

రాజా (సుజీ విజయ్),  రాణి (మౌనిక హెలెన్) తమ కుటుంబాలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. అంతా బాగానే ఉన్న సమయంలో రాజా తన కుటుంబ సభ్యులను చాలా కాలం తర్వాత కలుసుకుంటాడు. ఆ తర్వాత తన భార్యపై ఎటాక్ చేస్తాడు. అసలు రాజా.. తన భార్యపై ఎందుకు ఎటాక్ చేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఈమెపై దాడి చేయమన్నారా.. లేకపోతే వేరే మోటివ్ ఉందా అనేది తెలియాంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.            

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

గత కొన్నేళ్లుగా తెలుగులో హార్రర్ చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అందులో మంచి విషయమున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో దర్శకుడు బీఎస్ ప్రసాద్ ఈ సినిమాలో పాత్ర ముఖాలను చూపించకుండా.. చేసిన ఈ ప్రయత్నం మెచ్చుకోదగిందే. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయలేదు. దానికి దర్శకుడు హాట్సాఫ్ చెప్పాల్సిందే. అంతేకాదు తాను చెప్పాలనుకున్న విషయాన్ని .. తెరపై ఎలా చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనే దానిపై డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర.. ఎక్కడ భయపెట్టాలో అక్కడ తన సౌండింగ్ తో ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల బీజీఎంకు ప్రేక్షకులకు భయపెట్టాడు కూడా.  దర్శకుడి విజన్ కు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమాను నిలబెట్టాడు.

కొత్త దర్శకుడైనా ఇలాంటి చిత్రాన్ని ఎంతో అనుభవం దర్శకడిగా బాగానే డీల్ చేశాడు. కొన్ని సీన్స్ చూస్తే.. ఆర్జీవి హార్రర్ చిత్రాలను గుర్తుకు తెచ్చాడు. ఇక దర్శకుడుగానే కాకుండా... నిర్మాతగా కావడంతో ఎక్కడా ఎక్కువ ఖర్చు పెట్టించకుండా ఉన్నంతలో మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమా క్వాలిటీతో ఉంది.  ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వరకు మన దేశంలో ఏ సినిమా రాకపోవడం విశేషం. రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరా వర్క్ బాగుంది. మారుతి ఎడిటింగ్ ఎక్కడా ఎంత సీన్ ఉంచాలో మంచిగా తెలిసినట్టు ఉంది.

నటీనటుల విషయానికొస్తే..

సినిమా అంతటా సుజీ విజయ్ తన యాక్టింగ్ మెప్పించాడు. ఎక్కడా ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలో అంతలా తన యాక్టింగ్ మెప్పించాడు. చెప్పాలంటే సెటిల్డ్ పర్ఫామెన్స్ అని చెప్పాలి. మౌనిక హెలాెన్ నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. రా  రాజా.. ఢిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్..

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News