)
Rabandhu: కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజయం సాధించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ప్రీతి నిగమ్ ఈ మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఇంకా సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణుకుమార్ సహా చిత్రానికి సంబంధించిన నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నటి ప్రీతి నిగమ్ మాట్లాడుతూ.. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘రాబందు’ అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో ఈ సినిమా స్టోరీలో కూడా అదే పట్టుదలే కనిపిస్తుంది. ముఖ్యంగా మా దర్శకుడు, నిర్మాతకి అభినందలు తెలియజేస్తున్నాను. ఒక సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన కష్టార్జితాన్ని మొత్తం సినిమా కోసం పెట్టడానికి చాలా ధైర్యం కావాలి. ఆలా సినిమా మీదున్న ప్యాషన్ తో మంచి సినిమా తీసిన ఇలాంటి నిర్మాతలను ప్రోత్సహించాలి. నేను ప్రేక్షకులందరినీ చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్ కి వెళ్లి మూవీస్ ను చూడండి ఆదరించండి. అప్పుడు మీ జడ్జిమెంట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్ కలుగుతుందని చెప్పుకొచ్చారు.
ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..డైరెక్టర్ జయశేఖర్ నాకు మంచి మిత్రుడు..పూర్తిగా క్రైమ్ ఎంటర్టైన్మెంట్ గా వస్తోంది. యానిమల్ సినిమా లాగా రాబందు టైటిల్ చాలా మాస్ ఉంది. టైటిల్ లాగే ఈ సినిమా కూడా వైలెంట్ గా ఉంటుందనుకుంటున్నాను. ఇందులో నటించిన ప్రీతి గారికి, మా జూనియర్ రాజశేఖర్ ఇలా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇవ్వాలని ఈ సినిమా హిట్ అవుతుందనే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాత పులిజాల సురేష్ మాట్లాడుతూ.. మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సముద్రకి, టీజర్ ను విడుదల చేసిన ప్రీతీ నిగమ్ కి పేరు పేరున కృతజ్ఞతలు. మంచి కథతో ఒక సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని దర్శకుడు జయశేఖర్ చాలా బాగా తెరకెక్కించాడు. అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చించిది. త్వరలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని హిట్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. .
చిత్ర దర్శకులు జయశేఖర్ కల్లు మాట్లాడుతూ.. నేటిసమాజంలో జరుగుతున్న కొన్ని యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పులిజాల ఫిలిమ్స్ బ్యానర్ మీద మేము నిర్మించాము. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. చిత్ర నిర్మాత సురేష్ నన్ను నమ్మి సినిమా నాకు అప్పగించారు. అలాగే ఈ చిత్రం బాగా రావడానికి ఎంతో కష్టపడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు ధన్యవాదములు. మంచి కాన్సెప్ట్ తో త్వరలో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే 100 కోట్లు పెట్టి తీసిన ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో కనిపించాయి. ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత సురేష్ తన డబ్బును పొదుపు చేసుకొని ధైర్యం చేసి ఇంత పెద్ద సినిమా తీశాడా అని నేనే ఆశ్చర్యపోతున్నాను. అదే విధంగా దర్శకుడు జయశేఖర్ మంచి క్రియేటర్.. మేధావి కూడా. ఒక ఐదు సినిమాలు తీసినా ఘనత కూడా ఉంది. ఇందులో ప్రీతి మీనన్ గారు నటించడం అనేది మన అదృష్టంగానే భావించాలి నేను. ఇంకా జబర్దస్త్ టీం నుంచి కూడా కొంతమంది నటించారు. కొత్త వాళ్లైనా కూడా చాలా బాగా నటించారు. చిత్ర నిర్మాతకు ఆర్థికంగా లాభాలు కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే మంచి అవకాశం ఇచ్చిన సురేష్ కి, డైరెక్టర్ కి కృతజ్ఞతలు.
నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ..ఈ సినిమాలో హీరోకి నాన్న పాత్ర చేశాను. కొత్త రకం కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.