)
Constable Trailer : వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కానిస్టేబుల్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ AAA థియేటర్ లో సీనియర నటుడు రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్బంగా డా: రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో నేను కూడా పోలీస్ పాత్రలు ఎన్నో సినిమాల్లో చేశాను. అయితే ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సీరియస్ నెస్ సాగేవన్నారు. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా తన పాత్రలో ఒదిగి పోయి తీరు బాగుందని కితాబు ఇచ్చారు. అతిధులు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి లు మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమాలకు నేడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రేక్షకులు. ఆడియన్స్ ఇలాంటి సినిమాలకే బ్రహ్మరథం పడుతున్నారు. పోలీస్ వారు మన భద్రతకు అహర్నిశలు ఎంత శ్రమ పడుతున్నారో మనకు తెలిసిన విషయమే. అలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..నాకు ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. అయినప్పటికీ విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకొని నటించడాని ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ కథను డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ నాకు చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ ను ఊహించుకొని చెయ్యగలననే నమ్మకం ఏర్పడిన తరువాత ఈ మూవీ చెయ్యడం జరిగిందన్నారు. చిత్రంలో నా పాత్ర కూడా బాగా వచ్చిందన్నారు. తప్పకుండా మా అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. కంటెంట్ ను నమ్మి ఈ సినిమా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ స్టోరీ ఏడు, నుండి 8 మంది హీరో లను అనుకున్నాము. అయితే వరుణ్ సందేశ్ అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించామన్నారు. ఆయనకు ఈ కథ నచ్చడంతో ఈ సినిమాను చేశారు.ఒక వ్యక్తి కి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశానికి సందేశాన్ని మిలితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయాన్ని ప్రస్తావించారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. మా అందరి కెరీర్ ను మలుపుతిప్పే చిత్రమిది.వరుణ్ సందేశ్ కు కూడా కమ్ బ్యాక్ మూవీ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఆణి ముత్యాల్లాంటి నాలుగు పాటలు ఉన్నాయి. కానిస్టేబుల్ కు సంబందించిన పాటను గద్దర్ నర్సన్న అద్భుతంగా పాడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఇంకో పాటను పాడారు. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలున్న చిత్రమిది.బాధ్యతలను గుర్తు చేస్తూ హృదయాలను హత్తుకునే చిత్రమిది. పోలీస్ కుటుంబాలు అందరూ చూసిన మా సినిమాకు బాగా డబ్బులు వస్తాయన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ మధులిక వారణాసి,వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు..కెమెరామెన్ హజరత్ వలి, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, గాయకుడు గద్దర్ నర్సన్న, డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ అధినేత హర్ష, నటుడు దువ్వాసి మోహన్, నటీమణులు కల్పన, తేజు, భావన, నిత్య తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.