Raju Gari Ammayi Naidu Gari Abbayi OTT Streaming: అమెజాన్ ప్రైమ్ వీడియోలో సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’ మూవీ..

Raju Gari Ammayi Naidu Gari Abbayi OTT Streaming: ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు థియేట్రికల్ గా అంతగా ఆడపోయినా.. ఓటీటీ వేదికగా దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా థియేట్రికల్ గా విడుదలైన ‘రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’. మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2025, 07:17 PM IST
Raju Gari Ammayi Naidu Gari Abbayi OTT Streaming: అమెజాన్ ప్రైమ్ వీడియోలో  సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’ మూవీ..

Raju Gari Ammayi Naidu Gari Abbayi OTT Streaming: ప్రస్తుతం  ఓటీటీలో సస్పెన్స్  జానర్స్, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న "రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి"  సినిమాపై ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడిలో స్ట్రీమింగ్ అవుతోంది.  అక్కడ ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. తన్విక, మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వం వహించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.  మంచి స్పందనను రాబట్టింది. తాజాగా ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా కంటెంట్ బాగుందన్నారు.

Add Zee News as a Preferred Source

ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. పల్లెటూరులో జరిగే స్టోరీ.  నాయుడు గారి అబ్బాయి కర్ణ(రవితేజ నున్న) ఊరిలో జులై గా తిరిగే పోరడు. అదే ఊర్లో రాజు గారి అమ్మాయి అను(నేహా జురెల్)ను లవ్ చేస్తాడు.  ఇద్దరి లవ్వాయణంలో  ఒకరోజు శారీరకంగా దగ్గర కావాలనుకుంటాడు.  దాన్ని అను తిరస్కరిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఏర్పడుతాయి.  ఆ తర్వాతి రోజు అను శవమై కనిపిస్తుంది. ఆ మర్డర్ కు కర్ణకు ఏంటి సంబంధం? అనును చంపింది అతనేనా.. ? లేకపోతే అతనిపై అనుమానం కలిగేలా వేరే ఎవరైనా మర్డర్ చేసారా.. ? తన మరణానికి కర్ణ స్నేహితులకు ఏమైనా సంబంధం ఉందా? కర్ణ తండ్రి నాగినీడు పాత్ర ఏంటి? మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్  ఎలా సాగుతుంది? ఇంతకీ అను చనిపోయిందా లేదా చివరికి ఏమైందనేది? అనేది తెలియాలంటే  రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమాను ఓటీటీ చూడాల్సిందే.

నవరసాల సమ్మేళనంతో పూర్తి భావోద్వేగాలతో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది.  ఆద్యంతం కామన్  ప్రేక్షకుడిని కట్టుపడేసేలా ప్రతి సీన్ ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఊహించని రహస్యాలు, మలుపులు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి.  ముఖ్యంగా హీరో రవితేజ నున్న నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఓ కామన్ వ్యక్తి పై అనవసరమైన నేరం మోపితే ఎలా ఉంటుందో అలా చాలా చక్కగా సహజ సిద్ధంగా నటించాడు. ఎక్కడా యాక్ట్ చేసాడన్న ఫీల్ రాదు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

హీరోయిన్ నేహా జురెల్ ప్రతీ సన్నివేశంలో ప్రేక్షకుడి చూపు తన నుంచి తిప్పుకోకుండా యాక్ట్ చేసింది. తన పాత్రకు ప్రాణం పోసింది. క్యారెక్టర్ ఆర్టిస్టులు నాగినీడు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ప్రమోదిని తమ పరిధి మేరకు నటించారు. సినిమాకు టెక్నికల్ విలువలు బాగున్నాయి. మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్, బీజీఎమ్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా అబ్బుర పరుస్తాయి.  దర్శకుడు సత్య రాజ్ కుంపట్ల ప్రతీ ఫ్రేమ్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంది.  థియేటర్ లో ఈ మూవీ మిస్ అయిన వారు కచ్చితంగా ఓటీటీలో అద్భుతమై థ్రిల్ ను ఫీల్ అవ్వడం గ్యారంటీ అని చెప్పొచ్చు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News