Sivangi Review: వరలక్ష్మి శరత్ కుమార్, ఆనందిల ‘శివంగి’ మూవీ ఎలా ఉంది..? మెప్పించిందా..!

Sivangi Movie Review: ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘శివంగి’.  దేవరాజ్ భరణి ధరణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘శివంగి’. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా మూవీ మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2025, 05:11 PM IST
Sivangi Review: వరలక్ష్మి శరత్ కుమార్, ఆనందిల ‘శివంగి’ మూవీ ఎలా ఉంది..? మెప్పించిందా..!

రివ్యూ: శివంగి(Sivangi)
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, ఆనంది, జాన్ విజయ్, కోయ కిషోర్  తదితరులు..
సంగీతం: A.H కాషిఫ్ - ఎబినేజర్ పాల్
సినిమాటోగ్రఫీ: భరణి కె ధరన్
ఎడిటర్: సమ్జిద్ మహ్మద్
నిర్మాతలు: నరేష్ బాబు పి
దర్శకత్వం: దేవరాజ్ భరణి ధరన్
విడుదల తేది: 7-3-2025

Add Zee News as a Preferred Source

‘వంగే వాళ్లు వుంటే... మింగే వాళ్లు వుంటారు... నేను వంగే రకం కాదు... మింగే రకం...’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఈ డైలాగ్ మస్తు పాపులర్ అయింది. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో ఆనంది టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘శివంగి’ . దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు.  మరి ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
సత్యభామ (ఆనంది) ఓ సామాన్య గృహిణి.  ఈమె జీవితం అంతులేని కథ టైపు. ఓ వైపు భర్త అనారోగ్యం.  మరో వైపు ఆర్థిక సమస్యలు ఈమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు  అత్త నుంచి వేధింపులు. ఇలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఉంటుంది. మరోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో మరింత సతమతమవుతుంది సత్యభామ. దీంతో ఏం చేయాలో పాలు పోక ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. సత్యభామ పోలీసులను ఆశ్రయించడానికి గల కారణాలు ఏమిటి? ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? సత్యభామ తనకు ఎదురైన సమస్యలను ఎలా అధిగమించిందనేది మిగతా స్టోరీ..

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.           

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు ఈ సినిమాను ఓ సామాన్య గృహిణి ఫేస్ చేసే ఇబ్బందులను ఈ చిత్రంలో చూపెట్టాడు. దేవరాజ్ భరణి ధరన్ తన దర్శకత్వంలో ఎన్నో ఫేస్ చేసాడు. అంతేకాదు తెర మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ప్రేక్షకులు సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ మూవీ చూస్తున్నంత సేపు ఆడియన్స్ ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా స్టోరీ ముందుకు సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపించారు.   ఈ సినిమాలో  సింగిల్ లోకేషన్ లో... క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

ఆనంది... ఇప్పటి వరకు  పక్కింటి అమ్మాయిగా... చాలా పద్ధతిగా కనిపించే పాత్రల్లో నటించింది. ఆనంది పోషించిన సత్యభామ పాత్ర చుట్టూ ఎన్నో సమస్యలు... వాటిని ఛేదించుకునే క్రమంలో ఎన్నో ఆటంకాలు. వాటన్నింటినీ చివరకు ఎలా అధిగమించిందనేది శివంగిలో మంచి నటన కనబరిచింది. ఎక్కడా గ్లామర్ షో లేకుండా... కేవలం రెండు చీరలలో మాత్రమే సినిమా అంతా సింపుల్ గా కనువిందు చేసింది. ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో యాంగిల్ ప్రెజెంట్ చేసింది.  ఈ సినిమాలో యాక్ట్ చేసిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు.

పంచ్ లైన్.. మహిళా శక్తిని చాటే ‘శివంగి’

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News