Chaudhary gari Abbayi naidu gari Ammayi: హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సురేఖ వాణి కూతురు.. అదిరిన మూవీ ఫస్ట్ గ్లింప్స్..

Chaudhary gari Abbayi naidu gari Ammayi title Glimpse: తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రమే ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అబ్బాయి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 3, 2025, 07:50 PM IST
Chaudhary gari Abbayi naidu gari Ammayi: హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సురేఖ వాణి కూతురు.. అదిరిన మూవీ ఫస్ట్ గ్లింప్స్..

Chaudhary gari Abbayi naidu gari Ammayi title Glimpse: ఎమ్౩ మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’.   మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇది. అయితే ఈ చిత్రం "చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి" అనే టైటిల్ గ్లింప్స్ ను మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 

Add Zee News as a Preferred Source

ఈ  చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదల సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ..  "ఈ చిత్రాన్ని మేము తక్కువ బడ్జెట్ తో ప్రారంభించాము. కానీ మా హీరో హీరోయిన్ కి ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగిందన్నారు. అందరికి సుపరిచితం అయినా నటి నటులు రాశి , వినోద్ కుమార్, సురేఖ వాణి, రాజా రవీంద్ర వంటి ఈ సినిమాలో నటించారు. షూటింగ్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. "చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి" అనే మంచి టైటిల్ తో త్వరలో విడుదల చేస్తామన్నారు.

హీరోయిన్ సుప్రీతా నాయుడు మాట్లాడుతూ.. సినిమా ప్రారంభించే సమయంలో నాకు భయం వేసింది. కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. మా దర్శకుడికి ధన్యవాదాలు. మా హీరో అమరదీప్ కి ధన్యవాదాలు. షూటింగ్ టైం లో చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత నన్ను తన ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈరోజు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసాము. విజువల్స్ చాలా బాగున్నాయని తెలిపారు. 

నటి సురేఖ వాణి మాట్లాడుతూ "టైటిల్ చాలా బాగుంది. మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. సినిమా చాలా బాగా రావాలి సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. 

హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ "టైటిల్ చాలా బాగుందని మెచ్చుకున్నారు.  నా మొదటి సినిమా కి ఇంత మంచి టైటిల్ లో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.  నా జర్నీ లో మహేంద్ర  లాంటి మంచి నిర్మాతని నేనను ఎక్కడ చూడలేదు. సినిమా ని నమ్మితే ఎంత ఆయన ఖర్చు పెడతారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు.  చక్కగా ప్లాన్ చేసుకుని మంచి సినిమా తో రావాలని అనుకున్నాను.  అని కుదరడానికి ఇంత సమయం పట్టిందన్నారు. "చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి" మంచి సినిమా. మంచి ప్లానింగ్ తో ఈ సినిమా చేసాము. ఔట్ పుట్ బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News