ఈశ్వర్, నైనా సర్వర్ యాక్ట్ చేసిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానినొస్తే..
స్టూడెంట్ అర్జున్ (ఈశ్వర్) తన నలుగురు దోస్తులతో కలిసి జాలిగా ఎంజాయ్ చేస్తూ ఉండే రకం. అలా జ్యోతి (నైనా సర్వర్) లవ్ లో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఈ క్రమంలో ఓట్ల కోసం ఉచిత పథకాల పేరుతో ప్రజల్లో వెళతారు. అర్జున్ గ్యాంగ్‌లో ఒకరైన శీను అనుమానాస్పద పరిస్థితుల్లో చంపబడతాడు. శీనును ఎవరు చంపారు? ఆ ఘటన వెనక ఉన్న రాజకీయ కుట్ర ఏంటి? ఉచిత పథకాల వెనుక ఉన్న కుట్ర ఏమిటి..? అనే ప్రశ్నలకు సమాధానమే ‘సూర్యాపేట్ జంక్షన్’.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు రాజేష్ నాదెండ్ల ప్రెజెంట్ తెలంగాణ, ఏపీ రాజకీయాలను అద్దం పట్టేలా తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రజలకు విద్యా, వైద్యం, ఉపాధి వంటివి చూపించికుండా.. వారిని కేవలం ఓటు బ్యాంక్ గా భావించి సంక్షేమ పథకాలతో వాళ్లను బద్దకస్తులుగా చేస్తున్నారనే అంశాన్ని ఈ సినిమాలో చూపించాడు. ముఖ్యంగా ఈ ఉచితాలు అర్హులకు కాకుండా.. అనర్హులకు చేరడం..దాంతో కేవలం సంక్షేమాన్ని నమ్ముకొని.. రాజకీయ నాయకులు అభివృద్దిని విస్మరిస్తున్న విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో యాక్షన్ ప్లస్ కామెడీతో అలరించే ప్రయత్నం చేసాడు. వినోదానికి, సందేశానికి సమతుల్యతను అందించిన మంచి ప్రయత్నం అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. రోషన్ సాలూరి, గౌర హరి అందించిన నేపథ్య సంగీతం కథకు తగ్గట్టు బాగుంది. ముఖ్యంగా ఉచిత పథకాల వల్ల ప్రజలను బకరాలను చేయడం అనే కాన్సెప్ట్ ప్రజలను ఆలోచింప జేస్తోంది.
నటీనటుల విషయానికొస్తే..
ఈశ్వర్ అర్జున్ పాత్రలో తన యాక్షన్, డాన్స్, ఫైటింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. నటుడిగా మంచి ఫ్యూచర్ ఉంది. నైనా సర్వర్ జ్యోతి తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అందం, అభినయం రెండింటితో ఆకర్షించింది. అభిమన్యు సింగ్ క్రూరుడైన విలన్ పాత్రలో మెప్పించాడు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. వినోదంతోపాటు సందేశం ఇచ్చే ‘సూర్యాపేట జంక్షన్’ను మిస్ కావద్దు!"
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









