ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ ఐస్ అని ఓ ఆంగ్ల రచయత చెప్పినట్టు.. ఓ సినిమాకు బలం టైటిలే.పేరుతోనే సినిమాకు సగం మైలేజ్ వచ్చినట్టే.. ‘తకిట తదిమి తందాన’ పేరుతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేసారు మేకర్స్. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫాల్స్ ప్రెస్టేజికి వెళ్లి లోన్ యాప్స్ ఉచ్చులో పడితే.. వారి జీవితం ఎలాంటి ప్రభావాలకు లోనైందనే కాన్సెప్టే తెరకెక్కిందే ‘తకిట తధిమి తందాన’ స్టోరీ ఎలా ఉందంటే..
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
‘మర్డర్’ ఫేమ్ గణాదిత్య - అచ్చ తెలుగమ్మాయి ప్రియ కొమ్మినేని జోడిగా రాజ్ లోహిత్ ను దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నమే ‘ తకిట తధిమి తందాన’ సినిమా. ఇపుడు టెక్నాలజీ అరచేతిలో ఫోన్ రావడంతో బయట కాలు కదపకుండానే అన్ని పనులు చిటికెలో అయిపోతున్నాయి. అవి ఒకందుకు మంచివే అయినా.. మరో కోణంలో ఎంత ప్రమాదకరమనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టాడు దర్శకుడు రాజ్ లోహిత్. అంతేకాదు ఇప్పటి యూత్.. బెట్టింగ్ యాప్స్.. గేమ్ యాప్స్ కారణంగా లోన్స్ ను ఆశ్రయించి తల్లిదండ్రులను ఆర్ధికంగా చితికిపోయేలా చేస్తోన్న నేటి యువతకు ఈ సినిమా మంచి సందేశం.
స్వయంగా కథ - మాటలు రాసుకున్న రాజ్ లోహిత్... రచయితగా మంచి మార్కులు స్కోర్ చేసినా... దర్శకుడిగా కొంచెం తడబడ్డాడనిపిస్తుంది. తాను అనుకున్న కథను ఇంకాస్త బలంగా చూపెడితే బాగుండేది. ఆడియో క్వాలిటీపరంగా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో... ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం "స్విగ్గి బాయ్" గా పరివర్తన చెందడం వంటివి దర్శకుడి ఆలోచనకు నిదర్శనంగా నిలిచాయని చెప్పాలి. ముఖ్యంగా ఓ చెడు వ్యసనం నుంచి మళ్లీ మంచి మార్గం వైపు ఎలా మళ్లాడనేది ఈ సినిమా స్టోరీ బాగుంది. హరిశంకర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్లస్ గా నిలిచింది.. నరేన్ రెడ్డి సంగీతం గురించి పెద్దగా వంకలు పెట్టడానికి లేదు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇక ఈ చిత్రంతో నిర్మాతగానూ, నటుడిగానూ మారాడు చందన్ కుమార్ కొప్పుల. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓ ప్రతిభావంతుడ్ని దర్శకుడిగా, ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చెయ్యడం కచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశమనే చెప్పాలి. వినోదానికి సందేశం జోడించి.. ఒక క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన చందన్ నుంచి భవిష్యత్తులో కచ్చితంగా మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు.
నటీనటుల విషయానికొస్తే..
రామ్ గోపాల్ వర్మ "మర్డర్"తోపాటు... "సమ్మేళనం" అనే వెబ్ సిరీస్ లో నటించిన గణాదిత్య నేటి యూత్ ఐకాన్ పాత్రలో అలరించాడు. నటన విషయంలో ఇంకాస్త శ్రద్ద గొప్ప నటులు అవుతాడు. హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి "ప్రియ కొమ్మినేని"కి పర్వాలేదనిపించింది. పరభాషా హీరోయిన్లను చూసి చూసి విసిగిపోతున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోంది. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుంటుంది. గంగవ్వ కనిపించేది కాసేపే అయినా... కథకు మలుపు తిప్పే పాత్రలో నటించింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
పంచ్ లైన్.. ‘తకిట తధిమి తంధాన’ ఆలోచింపజేస్తూనే వినోదాన్ని పంచే ట్రెండీ ఎంటర్టైనర్.
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









