
The Suspect Review: గుడిపల్లి రుషి కిరణ్ కుమార్, ఘట్టమనేని శ్వేత, శిరిగిలం రూప, మర్రెబోయిన శివ యాదవ్, ఎరుగురాల రజిత తదితరులు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘ది సస్పెక్ట్’. టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో చిత్రం హీరో కం ప్రొడ్యూసర్ గుడిపల్లి రుషి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
అర్జున్(గుడిపల్లి రుషి కిరణ్ కుమార్)... ఓ సిన్సియర్ పోలీస్ అధికారి. అతనికి మీరా(ఘట్టమనేని శ్వేత) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అర్జున్ డ్యూటీలో బిజీగా వుండి శ్వేతను అంతగా పట్టించుకోకపోవడంతో వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. మరవైపు నగరంలో ప్రత్యూష (శిరిగిలం రూప)అనే విద్యార్థిని దారుణ హత్యకు గురవుతుంది. ఆ బాలిక హత్యకు కారకులైన హంతకులను పట్టుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్ మెంట్ అర్జుక్ అప్పజెప్పుతారు. అతని టీమ్ లో సదా శివ(శివ యాదవ్) కూడా వుంటారు. వీరిద్దరూ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఈ కేసును ఛేదించే పనికి వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి వ్యక్తి వారి ‘సస్పెక్ట్’గానే కనిపిస్తుంటారు. మరి ప్రత్యూష దోషులను వారు ఎలా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఏ జరిగిందనేదే ‘ది సస్పెక్ట్’ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
మర్డర్ మిస్టరీ సినిమాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి కథలకు స్టోరీలతో పాటు స్క్రీన్ ప్లే అనేదే ఎంతో ఇంపార్టెంట్.
దాన్ని పర్ఫక్ట్ గా సమపాళ్లలో రంగరిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవడానికి
దర్శకులు ఇలాంటి తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు. కొత్త దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించాడు.
‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తూనే ఉంటుంది. ఒక క్రైం సీన్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే... చివరి వరకూ హంతకులెవరు అన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్ తో మూవీని ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. కానీ మరో కోణంలో వారు కాదు... మరొకరున్నారనేది చివరి వరకూ కొనసాగుతూ వస్తుంది. ఇక ప్రీక్లైమాక్స్ లో అసలు హంతకులు ఎవరు అనేది తెలియడంతో... ఆ పాత్రపై జాలి కలుగుతుంది. మరోవైపు మెసెజ్ ఇచ్చినట్టు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరి మాట్లాడకూడదు. ఎగతాళి చేయకూడదని... ముఖ్యంగా విద్యార్థులుగా వున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది దర్శకుడు తెరపై చక్కగా ఆవిష్కరించాడు. సినిమా మొత్తం ఓ మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరుగుతూ ఆడియన్స్ ను ప్రతి సెకెనూ ఎంగేజ్ చేస్తుంది చిత్రం.
ఫస్ట్ హాఫ్ లో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, వారి లవ్ బ్రేకప్ తరువాత మళ్లీ కలుసుకోవడం లాంటి సీన్స్ తో ఇంటర్వెల్ కార్డ్ వేసి... ఆ తరువాత హీరో దోస్త్ సదా శివ చనిపోవడంతో సినిమా సెకెండాఫ్ ఆసక్తి రేకిస్తోంది. మొత్తంగా ఎన్నో మలుపుతూ ఈ సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
డైరెక్టర్ రాధా కృష్ణ ఎంచుకున్న కథ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే చివరి ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చేసింది. దాంతో ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా సినిమాను ఎంజాయ్ చేసేలా ఉంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ గ్రాండియర్ గా వున్నాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించిన విధానం బాగుంది. ఈ జోనర్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.
నటీనటుల విషయానికొస్తే..
కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా యాక్ట్ చేశారు. హీరో రుషి కిరణ్... ఇన్స్ పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశారు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అతనికి జంటగా నటించిన శ్వేత కూడా గ్లామరస్ గా కనిపించింది. హోమ్లీ లుక్ లో మెప్పించింది. ప్రత్యూష పాత్రలో నటించిన రూప కూడా బాగానే యాక్ట్ చేసింది. అలాగే లావణ్య పాత్రలో నటించిన రజిత యాక్టింగ్ మెప్పిస్తోంది. హీరో సహచరునిగా నటించిన మరో పోలీసు అధికారి పాత్ర మర్రెబోయిన శివకుమార్... సదా శివ పాత్రలో బాగా నటించారు. ఇక మిగతా రోల్స్ అన్ని తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
పంచ్ లైన్.. అట్రాక్ట్ చేసే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’..
రేటింగ్: 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe