Raju Gari Dongalu: లోహిత్ కల్యాణ్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, టీవీ రామన్, ఆర్కే నాయుడు లీడ్ రూల్స్ లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘రాజు గారి దొంగలు’. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో ఈ సినిమాను తెలుగు తెరపై ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై ఫస్ట్ కాపీ తో పాటు సెన్సార్ పూర్తి చేసుకొకి రెడీగా ఉంది. మొత్తంగా ఈ సినిమాను మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోందన్నారు. ఈ నెల 21న ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండన్నారు. తెలుగు ప్రేక్షకులందరు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి సందీప్ బదుల డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి అందించారు. ఈ చిత్రానికి నాఫల్ రాజా ఏఐఎస్ మ్యూజిక్ అందించారు. రాజ వంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ, సమర్పణ – నడిమింటి లిఖిత, నిర్మాత – నడిమింటి బంగారునాయుడు, లోకేష్ రనాల్ హిటాసో డైరెక్ట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









