Abhinav Movie: ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల సినిమాలతో పసి మనసుల్లో మంచిని నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. అంతేకాదు తన చిత్రాలకు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు సైతం అందుకున్నారు. ఆయన శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న మరో బాలల నేపథ్య చిత్రం “అభినవ్ “(chased padmavyuha). ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర లీడ్ రోల్స్ లో నటించారు. తాజాగా ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ – మన సమాజానికి క్యాన్సర్ లా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో అంతర్జాతీయ మాఫియా కుట్ర కోణం కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి సాహసాలు చేసాడనేది ఈ చిత్రంలో చూడబోతున్నాము.
తన స్నేహితులతో కలిసి అభినవ్ చేసిన సాహసాలు ఈ చిత్రంలో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ రహిత సమాజం కోసం సినిమా వాళ్లు చిన్న వీడియోలు చేయాలని కోరారు. నేను డ్రగ్స్ రహిత సమాజం కోసం నా వంతుగా ఈ సినిమాను నిర్మించడమే కాదు.. దర్శకత్వం వహించాను. డ్రగ్ మాఫియా మన గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా విస్తరించిందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఎన్ సీసీ, స్కౌట్స్, యోగ, ధ్యానం నేర్చుకోవడం ద్వారానే పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేస్తాయన్నారు. మన దేశం ఆర్థికంగా వెనకబాటుకు పిల్లల్లో అక్షరాస్యత లేకపోవడం కూడా ఓ కారణమన్నారు. పిల్లలను బాగా చదివించడం ద్వారా మన దేశాన్నిఅన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలపవచ్చన్నారు. ఇలాంటి అంశాలన్నీ అభినవ్ చిత్రంలో చూపించబోతున్నాము. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము.
అభినవ్ చిత్రాన్ని విద్యార్థులకు చూపించడం ద్వారా వారిలో మంచి ఆలోచనలు కలిగించేలా చేయడం మన కర్తవ్యమన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో 30 ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న మంత్రి కొండా సురేఖకి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందించడం ఆనందంగా ఉందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









