హర్ష్ రోసణ్, కార్తికేయ దేవ్, స్టేవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘టుక్ టుక్’. చిత్ర వాహిని ప్రొడక్షన్స్ , RYG సినిమా బ్యానర్ పై రాహుల్ రెడ్డి నిర్మించారు. సుప్రీత్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
అనగనగా ఓ ఊరు. అందులో ముగ్గురు టీనేజ్ యువకులు (హర్ష్ రోషన్, కార్తీక్ దేవ్, స్టీవెన్ మధు) మంచి స్నేహితులు. వాళ్లు ఓ కెమెరా కొనాలనుకుంటారు. ఈ క్రమంలో ఊర్లో వినాయక చవితి సందర్బంగా వసూల్లు చేసిన చందాలో దేవుడి పూజలకు డబ్బులు పోను.. మిగిలిన వాటితో కెమెరా కొనాలాని ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా ఆ ఊర్లో గొడవల కారణంగా వీళ్ల తమ దగ్గర పాత బండికి ఇంకో చక్రం తగిలించి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత ఆ బండి తనంత తానే కదలుతూ ఉంటుంది. ఇంతకీ టుక్ టుక్ అనే బండి సొంతంగా ఎందుకు కదులుతుంది. దీని వెనక దైవ శక్తి ఏమైనా ఉందా.. ? లేకపోతే మరేదైనా శక్తి ఉందా.. ? చివరకు టుక్ టుక్ బండితో ఈ ముగ్గురు జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
బండ్లు వాటంతట అవే నడవడం.. గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చూసిందే. టుక్ టుక్ అనే సినిమాను కూడా అదే కాన్సెప్ట్ తో దర్శకుడు తెరకెక్కించాడు. ఇక్కడ టుక్ టుక్ అంటే మూడు చక్రాల బండి అనే అర్ధంలో ఈ సినిమాకు దర్శకుడు ఈ టైటిల్ పెట్టాడు. ఈ సినిమా మొత్తాన్ని చిత్తూరు నేపథ్యంలో 15 యేళ్ల క్రితం నాటి స్టోరీ ప్రేక్షకులకు చూపెట్టాడు దర్శకుడు.ఇక వినాయక చవితి అంటే మన దగ్గర ఎలాంటి హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినాయక చవితి సందర్భంగా చందాలు వసూళు చేయడం చూస్తుంటే.. చాలా నాచురల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో దేవుడే తమ బండిని నడుపుతున్నాడని చెప్పి.. డబ్బు సంపాదించుకుంటారు. తీరా అందులో ఉన్న దేవుడు కాదు.. ఎవరితో ఆత్మ తెలియగానే.. ఈ కుర్రాళ్లు భయపడటం వంటివి నాచురల్ గా అనిపిస్తున్నాయి. ఇంతకీ బండి అంటీ పెట్టుకొని ఉండే ఆత్మ ఎవరు..? ఎందుకు ఈ బండిలో ఉండిపోయాడనే విషయాలను సెకండాఫ్ లో ఆసక్తికరంగా చూపించాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఎక్కువగా గ్రాఫిక్స్ వంటివి కాకుండా నాచురల్ లొకేషన్స్ లో సినిమా తెరకెక్కించడం బాగుంది. ఆర్ఆర్ పర్వాలేదు. దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు చక్రాల బండిపైనే ఎక్కువగా చూపించి సినిమాకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. సినిమాలో ఆడియన్స్ కు ఉన్న కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. ముఖ్యంగా చిన్న పిల్లకు ‘టుక్ టుక్’ లాంటి సినిమాలు ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చి రెండో పార్ట్ ఉందని చెప్పాడు దర్శకుడు.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో టీనేజ్ యువకుల పాత్రలో నటించిన హర్ష్ రోషన్.. రీసెంట్ గా కోర్టు మూవీలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే సలార్ లో పృథ్వీరాజ్ పాత్ర చేసిన బాల నటుడు కార్తికేయ దేవ్ తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించాడు. స్టీవెన్ మధు నటన ఆకట్టుకుంటుంది. సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ నటించి మెప్పించారు. సినిమాలో మిగతా పాత్రల్లో నటించిన నటులు తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. మెప్పించే ‘టుక్ టుక్’..
రేటింగ్: 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









