)
Constable Censor Talk: వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కానిస్టేబుల్’. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. డైరెక్షన్ లో బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ చేతులమీదుగా విడుదల చేశారు.అనంతరం భరత్ భూషణ్ స్పందిస్తూ, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు వాల్లు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు కానిస్టేబుల్ సినిమాలో భావోద్వేగాలతో పాటు స్టోరీ లైన్ సూపర్ అంటూ పొగడుతున్నారు. ఈ చిత్రం పోలీస్ చిత్రాల్లో తప్పక చోటు దక్కించుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, సెన్సార్ పూర్తి కావడం, అలాగే ట్రైలర్ కి వచ్చిన స్పందన చూసి ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. అంతేకాదు ఈ నెల 10న థియేట్రికల్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఇందులోని ఒక మంచి ఐటమ్ సాంగ్ ను దసరా సందర్భంగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ..సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. సెన్సార్ వాళ్లతో సినీ పరిశ్రమలోని పెద్దలు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ట్రైలర్ కు వచ్చిన స్పందనతోనే మేము సగం విజయం సాధించామని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ కు 50 లక్షల మది ట్రైలర్ చూడడం అంటే అది మామూలు విషయం కాదనన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, సూర్య, రవి వర్మ, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి హజరత్ షేక్ (వలి) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు.వర ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. బి.జి.ఎం.:గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు,శ్రీనివాస్ తేజ మాటలు అందిస్తున్నారు. రామారావు పాటలు అందించారు. శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య, సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం;: ఆర్యన్ సుభాన్ SK అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.