Viral Prapamcham: వెరైటీ కాన్సెప్ట్ ‘వైరల్ ప్రపంచం’.. మూవీ ఎలా ఉందంటే..

#Viral Prapamcham Movie Review: ఈ డిజిటల్ యుగం వచ్చిన మన జీవితాల్లో ఎన్ని మంచి పరిణామాలతో పాటు దుష్రరిణామాలున్నాయి.  కొంత మంది యువత ఈ వైరల్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘వైరల్ ప్రపంచం’ నేడు థియేట్రికల్ గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2025, 03:38 PM IST
Viral Prapamcham: వెరైటీ కాన్సెప్ట్ ‘వైరల్ ప్రపంచం’.. మూవీ ఎలా ఉందంటే..

డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఫేస్ చేస్తున్నారు.  టెక్నాల‌జీ అనేది ఒక కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ లాంటిది. దాన్నుంచి ఒదుపుగా వాడుకోవాలని కానీ.. డైరెక్ట్ గా పట్టుకుంటే మాడి మసైపోతారు. అలాగే టెక్నాలజీ అనేది ఎంత వరకు వాడుకుంటే అంత బాగుంటుంది. అది మితి మీరితే ఎలాంటి దుష్పరిణాలు ఎదురు అవుతాయనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘వైరల్ ప్రపంచం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆక్టటుకుంటుందో చూద్దాం..

Add Zee News as a Preferred Source

క‌థ‌ విషయానకొస్తే:
యూఎస్ వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ) యువతి రవి (సాయి రోనక్)తో  4 యేళ్ల  సంబంధాన్ని ఏ విధంగానైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.  సీన్ క‌ట్ చేస్తే.. అలాగే  ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తోన్న అదితి (నిత్య‌శెట్టి) అనే అమ్మాయి సామాజిక మాధ్యమంలో తాను కలిసే ప్ర‌వీణ్‌ (స‌న్నీ న‌వీన్)తో ఎమోష‌న్ బాండింగ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయిలిద్దరు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను, అంతర్జాలాన్ని నమ్ముకుంటారు.  ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా స్టోరీ.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.             

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

‘వైరల్ ప్రపంచం’ ప్రస్తుతం మన చుట్టు జరిగే  వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఒకప్పుడు మన గురించి వేరే వాళ్లకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇంటర్నెట్ పుణ్యామా అని.. మనకు సంబంధించిన అన్ని విషయాలను ఫేస్ బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ మనకు సంబంధించిన అన్ని గుట్లను బయట పెట్టేస్తున్నాము. దీన్ని కొంత మంది దుర్వినయోగం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బ్రిజేష్ టాంగి.. వీడియో కాల్స్..స్క్రీన్ రికార్డింగ్  వల్ల మన లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది తెరపై చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. అంతేకాదు ఇప్పటి యూత్ ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ సినిమాను తెరకెక్కించాడు.

అంతేకాదు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమే కుగ్రామం అయింది. దీంతో సంబంధాలు ఎలా ప్రభావిమవుతున్నాయనేది తెరపై చక్కగా చూపించాడు. మొత్తంగా స్క్రీన్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎంతో మంది లైఫ్ లు ఎలా నాశనమయ్యానేది ఆధారంగా తెరకెక్కించారు. యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. మన ప్రపంచంలో ఒక్కో మనషి మన ముందు ఒకలా.. అదే సోషల్ మీడియాలో మరోలా ప్రపర్తిస్తున్నారు. మన వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయనేది ఈ సినిమాలో చూపెట్టడం విశేషం. సోషల్ మీడియా మన అనుబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది చూపెట్టాడు.

మ్యూజిక్ ఎంతో ఎమోష‌న‌ల్ ను కలిగిస్తుంది. ఎడిటింగ్ ప‌ర్‌ఫెక్టుగా సెట్ అయింది. కెమెరా వర్క్ బాగుంది. స్క్రీన్ బేస్డ్‌ను చాలా నాచుర‌ల్‌గా తెర‌కెక్కించారు.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:

ఈ సినిమాలో రెండు జంట‌లుగా నటించిన ఇద్దరు ప‌ర్‌ఫెక్టుగా సెట్ అయ్యారు. రవి పాత్ర‌లో సాయి రోనక్, స్వ‌ప్న పాత్ర‌లో ప్రియాంక శర్మ, అదితి పాత్ర‌లో నిత్య‌శెట్టి, ప్ర‌వీణ్ పాత్ర‌లో స‌న్నీ న‌వీన్.. ఈ జనరేషన్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా వీరి పాత్రలున్నాయి. సినిమాలో క్యారెక్టర్స్ కాకుండా నిజ జీవిత పాత్రలా కనిపించాయి.

పంచ్ లైన్.. మానవ సంబంధాలను తెలిపే ‘వైరల్ ప్రపంచం’..

రేటింగ్: 2.5 / 5

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News