W/O Anirvesh: హీరో శివాజీ చేతులు మీదుగా లాంచ్ అయిన W/O అనిర్వేష్ ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్..

W/O Anirvesh: తెలుగు సహా ఇతర భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో చిత్రం W/O అనిర్వేష్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హీరో శివాజీ చేతులు విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 3, 2025, 08:13 AM IST
W/O Anirvesh: హీరో శివాజీ చేతులు మీదుగా లాంచ్ అయిన W/O అనిర్వేష్ ట్రైలర్.. సోషల్ మీడియాలో వైరల్..

W/O Anirvesh: జబర్ధస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్స్ కు పునర్జన్మను ఇచ్చిందనే చెప్పాలి. ఈ టాలెంట్ షోతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్స్ పరిచయమయ్యారు. ఈ కోవలో జబర్ధస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ ముఖ్యపాత్రలో జెమినీ సురేశ్, కిరీటీ సాయి ప్రసన్న, సాయి కిరణ్, నాజియా ఖాన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం W/O ఆనిర్వేశ్. గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తున్నారు.  గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

Add Zee News as a Preferred Source

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హీరో శివాజీ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో రాంప్రసాద్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. రాంప్రసాద్ కామెడీనే గుర్తుకు వస్తుంది. అందుకు డిఫరెంట్ గా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించనట్టు తెలుస్తోంది.
ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాను జనాలు గుర్తుంచుకుంటారని చెప్పుకొచ్చారు హీరో శివాజీ.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు.   మార్చి ఏడో తారీఖున చిత్రం విడుదలకు రెడీగా ఉందన్నారు. దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ..  జబర్దస్త్ రాంప్రసాద్ వంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం చాలెంజింగ్ గా అనిపించిదన్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ వి ఆర్ కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ.  ఈ చిత్రంలో  చిత్రంలో నటించినటువంటి నటీనటులు న ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు.మార్చి ఏడో తారీఖున ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News