IMD Issued RED Alert to Telangana: తీవ్ర అల్పపీడనం గురువారం అల్పపీడనంగా బలహీన పడి ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతోంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. రుతుపవన ద్రోణి ఈ రోజు బికానర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిస్సా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ రోజు షీయర్ జోన్ 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.
నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న రెండు రోజులకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
రాగల 2 రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలుల గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని కోరామని చెప్పారు. భద్రాచలం పట్టణంలో భారీ మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నామన్నారు. కడెం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో ఉందని.. రెండు గేట్లు మొరయిస్తున్నాయన్నారు. ఉదయంతో పోలిస్తే ఇన్ ఫ్లో తగ్గిందని.. వాటిని సాధ్యమైనంత తొందరగా పునరుద్దరిస్తామన్నామని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాల తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.
Also Read: Telangana Rain Updates: అర్ధరాత్రి అభయారణ్యంలో 80 మంది పర్యాటకులు.. ఒక్క ఫోన్ కాల్‌తో..!
Also Read: Revanth Reddy: విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. వర్షాలపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook