Operation Cheetah: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత, మెట్లమార్గం ఇక సురక్షితమేనా

Operation Cheetah: తిరుమల శేషాచలం కొండల్లో మరో చిరుత పట్టుబడింది. చిరుతల్ని పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. వారం రోజుల వ్యవధిలో మూడు చిరుతలు పట్టుబడటంతో మెట్లమార్గం ఇక సురక్షితం కావచ్చని భావిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2023, 09:01 AM IST
Operation Cheetah: తిరుమలలో బోనులో చిక్కిన  మరో చిరుత, మెట్లమార్గం ఇక సురక్షితమేనా

Operation Cheetah: తిరుమల కొండకు చేరుకునే మెట్లమార్గం గత కొద్దిరోజులుగా ఆందోళన కల్గిస్తోంది. ఓ చిన్నారిపై దాడి, మరో చిన్నారి మృతి నేపధ్యంలో అటు తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు అటవీ శాఖ అప్రమత్తమయ్యాయి. ఆపరేషన్ చిరుతను చేపట్టాయి. జూన్ నుంచి ఇప్పటి వరకూ నాలుగు చిరుతల్ని పట్టుకుని ఆపరేషన్ ముగించారు.

గత కొద్దికాలంగా తిరుమలకు వెళ్లే భక్తులకు చిరుత భయం వెంటాడుతోంది. అలిపిరి కాలినడక అంటే మెట్లమార్గంలో చిరుతల సంచారం, దాడి ఎక్కువయ్యాయి. ఇటీవలే ఓ చిన్నారిపై చిరుత దాడి చేయగా గాయాలతో బయటపడింది. మరో చిన్నారి మృత్యువాత పడింది. ఈ రెండు ఘటనలతో అధికారులు అప్రమత్తమై చిరుతల్ని పట్టుకునేందుకు రంగంలో దిగారు. ఎక్కడికక్కడ బోనులు, కెమేరాలు ఏర్పాటు చేసి చిరుతలు సంచరించే ప్రాంతాల్ని గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో ముందు జూన్ 24న ఓ చిరుతను బంధించారు. ఆ తరువాత చాలారోజులు అటవీ శాఖాధికారులకు నిరాశే ఎదురైంది. తిరిగి ఆగస్టు 14న రెండవ చిరుత బోనులో చిక్కింది. ఆ తరువాత 17వ తేదీన మూడవ చిరుత పట్టుబడింది. ఇక నిన్న రాత్రి అంటే ఆగస్టు 28న నాలుగో చిరుత అలిపిరి 7వ మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. 

వాస్తవానికి ఈ చిరుత గత వారం రోజుల్నించి అటవీ శాఖాధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. బోను వరకూ రావడం, వెనక్కి వెళ్లిపోవడాన్ని అధికారులు కెమేరాల ద్వారా గమనిస్తున్నారు. బోనులో ఆ చిరుతను రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. మొత్తానికి వారం రోజుల తరువాత నాలుగవ చిరుత బోనులో చిక్కింది. దాంతో చిరుత ఆపరేషన్ ముగిసినట్టేనని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ఎందుకంటే ఇక చిరుతల సంచారం ఉండకపోవచ్చనేది అధికారుల అంచనా.

చిరుతల సంచారంతో మెట్లమార్గంలో ప్రయాణించేందుకు భక్తులు భయపడుతున్నారు. మెట్లమార్గంలో కంచె ఏర్పాటు చేయాలనే డిమాండ్ అదికమౌతోంది. ఇప్పుడు మొత్తం నాలుగు చిరుతల్ని బంధించగలగడంతో ఇక మెట్లమార్గం సేఫ్ అని అధికారులు భావిస్తున్నారు. చిరుతల్ని పట్టుకున్నారు గానీ ఇదే మార్గంలో ఎలుగుబంట్ల సంచారం కూడా ఉంది. మరి వీటి నుంచి రక్షణ ఎలా కల్పిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. 

Also read: Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్ష సూచన

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News