Radish Side Effects: ముల్లంగి చాలా రుచిగా ఉండటమే కాకుండా అద్భుతమైన పోషక పదార్దం. చలికాలంలో మార్కెట్ అంతా ముల్లంగితో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్ కే , ఫైబర్, పొటాషియం పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముల్లంగి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి.
Radish Side Effects: ముల్లంగి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరమౌతుంది. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే ముల్లంగి తినేటప్పుడు కొన్ని సూచనలు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమందికి ముల్లంగి తినడం ఆరోగ్యరీత్యా మంచిది కానే కాదు. ఎవరెవరికి మంచితి కాదో తెలుసుకుందాం..
పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా ముల్లంగి తినకూడదు. ఇందులో ఉండే కొన్ని పోషకాలు పాలలో చేరి శిశువుకు హాని కల్గించవచ్చు.
గర్బిణీ మహిళలు గర్భిణీ మహిళలకు ముల్లంగి తినడం ఆరోగ్యరీత్యా మంచిది కాదు. అందుకే వైద్యులు గర్భిణీ స్త్రీలకు డైట్లో ముల్లంగి ఉండకూడదంటారు.
పిత్తాశయంలో రాళ్లు చాలామందికి పిత్తాశయంలో రాళ్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముల్లంగి అస్సలు తినకూడదు. ముల్లంగిలో పిత్తాశయం ఉత్పత్తిని పెంచే గుణాలుంటాయి. దాంతో రాళ్ల సమస్య పెరిగిపోతుంది.
హైపోగ్లైసీమియా హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ సమస్య ఉన్నప్పుడు కూడా ముల్లంగి తినకూడదు. ముల్లంగిలో ఇన్సులిన్ పెంచే గుణాలుంటాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గిపోతుంది.
లో బీపీ సమస్య చాలామందికి లో బీపీ సమస్య ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు ముల్లంగి తినకూడదు. ముల్లంగి తినడం వల్ల శరీరంలో నీరు బయటకు పోయి లో బీపీ సమస్య పెరిగిపోతుంది.