Veteran actor R Subbalakshmi Passes away: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఆర్. సుబ్బలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. 87 ఏళ్ల సుబ్బలక్ష్మి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ మరణ వార్త తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
సుబ్బలక్ష్మి దాదాపు 75 సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఎన్నో సీరియళ్లు, వాణిజ్య ప్రకటనల్లోనూ మెరిశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ పనిచేశారు. సుబ్బలక్ష్మి కేవలం నటి మాత్రమే కాదు కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు చిత్రకారిణి కూడా. ఈమె ఆల్ ఇండియా రేడియోలోనూ సేవలందించారు. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో ఆల్ ఇండియా రేడియోకి మొదటి మహిళా స్వరకర్త సుబ్బలక్ష్మి. ఈమెకు దివంగత కళ్యాణకృష్ణన్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈమె మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు సంస్కృత చిత్రాలలో కూడా నటించారు. 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే ఆంగ్ల చిత్రంలో కూడా ఓ కీలక పాత్రను పోషించారు సుబ్బలక్ష్మీ. ఈ సీనియర్ నటి చివరగా తమిళంలో విజయ్ దళపతి బీస్ట్ లో కనిపించారు. 65 కంటే ఎక్కువ టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. అమ్మమ్మ పాత్రల ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: Salaar Trailer: ప్రభాస్ సలార్ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి