VIP Car Number Plates Get No Extra Cost : ప్రతి ఒక్కరికి VIPలకు సంబంధించిన కారు నెంబర్లు చూసిన వెంటనే గుర్తుండి పోతూ ఉంటాయి. వాటిని ఎప్పుడు అడిగినా టక్కున చెప్పగలుగుతారు. ప్రస్తుతం చాలామంది తమకిష్టమైన కార్లను కొనుగోలు చేయడమే కాకుండా ఇష్టమైన నెంబర్లతో నెంబర్ ప్లేట్లను కూడా కనుక్కోవాలి. కానీ ఇలాంటి పనులను కేవలం పరపతి డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే చేస్తూ ఉంటారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మీరు కూడా వారిలో ఒకరు కావాలనుకుంటున్నారా? మీరు కూడా VIP ఫ్యాన్సీ నెంబర్ పొందాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే.. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా మీరు కూడా మీ కారు నెంబర్ ప్లేట్‌కు విఐపి(VIP) నెంబర్‌ను పొందవచ్చు అది ఎలాగో..దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
VIP కారు నంబర్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
విఐపి నెంబర్ను కొనుగోలు చేసేందుకు ఎలాంటి కష్టపడినక్కర్లేదు మీరు ఇంట్లో కూర్చుని కూడా ఫాన్సీ నెంబర్ను పొందవచ్చు. దీనికోసం మీరు చేయవలసిందల్లా గూగుల్‌లో VIP కార్ నెంబర్ లేదా ఫ్యాన్సీ కార్ నెంబర్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మీకు.. మీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ కనిపిస్తుంది. ఇక అందులోనే టోటల్ ప్రాసెసింగ్ ఉంటుంది. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అందులో విఐపి(VIP) కార్ నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి పూర్తి వివరాల అందించాల్సి ఉంటుంది. ఇలా మీకు నచ్చిన నెంబర్‌ను దరఖాస్తు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
VIP కార్ నంబర్ దరఖాస్తు ప్రక్రియ:
✤ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీవో అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో నెంబర్ ప్లేట్ దరఖాస్తు కోసం లాగిన్ అవ్వాలి.
✤ ఆ తర్వాత మీరు కొన్న కారు లొకేషన్ బట్టి ఆర్టీవో ఆఫీస్‌ని ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్న తర్వాత మీకు VIP నెంబర్ ప్లేట్‌లకు సంబంధించిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
✤ ఇలా "విఐపి నెంబర్ ప్లేట్" అనే ఆప్షన్ కనిపించిన దానిపై క్లిక్ క్లిక్ చేయాలి. అయితే అందులోనే మీకు నచ్చిన కార్ నెంబర్‌ను టైప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
✤ అప్లోడ్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేసి ఆ తర్వాత "నెంబర్ అప్లై" అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న నెంబర్ పై RTO డిపార్ట్మెంట్ వారు ఎంత చార్జ్ చేస్తున్నారో? ఇంకా ఎంత చెల్లించాలో అనే అన్ని వివరాలు మీకు కనిపిస్తాయి.
✤ ఇలా కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లే..అయితే RTO అధికారిక వెబ్‌సైట్‌లో చార్జ్ చేసిన బిల్ చెల్లించి మీరు కోరుకున్న నెంబర్ ప్లెట్ పొందవచ్చు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter