Shocking: ఘోరం.. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక సూసైడ్ చేసుకున్న దంపతులు..

Crime News: కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్ అతని భార్య భాగ్య పురుగుల మందు తాగారు. పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 17, 2024, 05:06 PM IST
  • - బంధువుల ఇంట్లో పంపి దారుణం..
    - క్రెడిట్ కార్డుల చెల్లించలేక ఘటన..
Shocking: ఘోరం.. క్రెడిట్ కార్డు బిల్లులు  కట్టలేక సూసైడ్ చేసుకున్న దంపతులు..

Husband And Wife Commits Suicide In Keesara: పెళ్లైన తర్వాత కొందరు విచ్చలవిడిగా డబ్బులను ఖర్చులు చేస్తుంటారు. అవసరం ఉన్నవి లేనివన్ని కోనుగోలు చేస్తుంటారు. లగ్జరీ లైఫ్ ను గడపాలనుకుంటారు. అయితే..  తమకు ఉద్యోగంలో వచ్చేశాలరీలు, బిజినెస్ లో డబ్బులను బట్టి ప్లాన్ లు వేసుకొవాలి. కానీ కొందరుమాత్రం.. తమ సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారు. దీని కోసం అప్పులు చేస్తుంటారు.

లోన్ యాప్ లలో డబ్బులు తీసుకుంటారు. మరికొందరు క్రెడిట్ కార్డులలో అప్పులు తీసుకుని మరీ కావాల్సినవి తెప్పించుకుంటారు. తీరా అవి సమయానికి తీర్చేదారిలేక, క్షణికావేశంలో తమ వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన విషాదకర ఘటన కీసరలో చోటు చేసుకుంది. 

మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేకపోతున్నామనే మనస్తాపంతో కీసరకు చెందిన సురేష్, భాగ్య దంపతులు శనివారం పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. అప్పటికే సురేష్ తమ పిల్లలను బంధువులు ఇంట్లో వదిలిపెట్టి వచ్చినట్లు తెలుస్తోంది. 

స్థానికుల సమాచారంతో పోలీసులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టలేకే.. దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులిద్దరు చనిపోపవడంతో పిల్లలిద్దరు కూడా అనాథలుగా మారారు. ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read More: Iswarya Menon: ఎరుపెక్కిన అందాలతో హీటెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Read More: Red Bananas: ఎరుపు రంగు అరటి పండ్లతో బోలెడు లాభాలు.. మీరు ఓ సారి ట్రై చేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News