Virat Kohli Deepfake: డీప్‌ ఫేక్ వలలో విరాట్ కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో..

Scam alert: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీల డీప్‌ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వారాల క్రితం లెజెండరీ సచిన్ టెండూల్కర్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న నకిలీ వీడియో వైరల్ కాగా..తాజాగా కోహ్లీ డీప్ ఫేక్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 04:33 PM IST
Virat Kohli Deepfake: డీప్‌ ఫేక్ వలలో విరాట్ కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో..

Virat Kohli Deepfake video viral: నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో ప్రారంభమైన డీప్ ఫేక్ గోల కంటిన్యూ అవుతుంది. ఆ మధ్య క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూల్కర్ ను టార్గెట్ చేసిన మోసగాళ్లు.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డీప్‌ ఫేక్‌ వీడియో సృష్టించి సంచలనం రేపారు. కోహ్లీతో పాటు ప్రముఖ యాంకర్‌ అంజనా ఓమ్‌ కశ్యప్‌ కూడా దీని గురించి మాట్లాడినట్టు డీప్‌ ఫేక్‌ వీడియో క్రియేట్ చేశారు. 

ఈ వీడియోలో ఏవియేటర్‌ అనే గేమింగ్‌ యాప్‌ గురించి కోహ్లీ మాట్లాడుతున్నట్టు చూపించారు. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని.. నాకు ఖాళీ దొరికితే ఇందులోనే డబ్బులు డిపాజిట్‌ చేస్తానని కోహ్లీ చెప్పినట్టుగా వీడియో క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే బోనస్‌ కూడా వస్తుందని కింగ్ కోహ్లీ చేత చెప్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై కోహ్లీ స్పందించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్ తో సిరీస్ నుంచి విరాట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ క్రికెటర్ ఫ్యామిలీతో గడుపుతున్నాడు. 

గతంలో సచిన్ డీప్ ఫేక్ వీడియో సృష్టించి అందులో అతడు ఓ గేమింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్టుగా చూపించారు. అంతేకాకుండా సచిన్ కూతురు సారా తరుచూ ఈ గేమింగ్ యాప్ ఆడుతుందని.. డబ్బులు బాగా సంపాదిస్తుందని సచిన్ చెప్పినట్లు వీడియో క్రియేట్ చేశారు. దీనిపై సచిన్ స్పందించాడు. ఈ వీడియోను ట్విటర్‌ (ఎక్స్‌)లో పోస్ట్‌ చేసి ఇలాంటి వీడియోలు పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అంతేకాకుండా ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ కూడా డీఫ్ ఫేక్ వీడియో బారిన పడిన సంగతి తెలిసిందే. 

Also Read: ఈ పాము మినరల్ వాటర్ తప్ప జనరల్ వాటర్ తాగదట.. వైరల్ అవుతున్న వీడియో.. 

Also Read: Bank Holidays in March 2024: మార్చ్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News