Dedeepya Rao Incident: బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇటీవల దాడులు తీవ్రమయ్యాయి. తాజాగా హైదరాబాద్లో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యపై దాడి జరిగింది. అర్ధరాత్రి మహిళలు కారును చుట్టుముట్టి బండబూతులు తిట్టారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామం కలకలం రేపింది. ఈ సంఘటనపై గులాబీ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోతుందని మండిపడ్డారు.