Cops In Priest Attire: ప్రఖ్యాత కాశీ విశ్వనాథుని ఆలయంలో ఇక మీదట పోలీసులు రుద్రాకలు,త్రిపుండ్రాలు ధరించి బందోబస్తులో ఉంటారు. అదే విధంగా మహిళా సిబ్బంది శల్వర్- కుర్తాలు ధరించి సెక్యురిటీలో ఉంటారని పోలీసుల అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ లో కాశీ విశ్వనాథుని ఆలయం ఎంత ఫెమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు వేలాది భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలిచ్చి శివయ్యను దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ముఖ్యంగా ఆలయాలకు భక్లులు ఎక్కువగా సంప్రదాయ దుస్తులలో రావాలంటూ ఆలయ పూజారులు, సిబ్బంది సూచిస్తుంటారు.
కాశీ విశ్వనాథుని ఆలయంలో మాత్రం ఇక మీదట పోలీసులు ధోతీ, మెడలో రుద్రాకలు ధరించి సెక్యురిటీ నిర్వహిస్తారు. అదే విధంగా మహిళలు మాత్రం..సల్వర్ కమీజ్ లు ధరించి సెక్యురీటీని లో ఉంటారని వారాణాసి పోలీసు కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీచేశారు,
పోలీసు బాస్ ఆదేశాల మేరకు.. పోలీసులు సెక్యురిటీ దుస్తులు పూజారుల మాదిరిగా ఉంటే భక్తలు, పోలీసులు చెప్పింది వెంటనే ఆచరిస్తారని పోలీసులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు పోలీసులను గుడిలో బందో బస్తును నిర్వహించడంను వ్యతిరేకిస్తుంటారు. అయితే.. దీనిపై మాత్రం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మండిపడుతున్నారు.
పోలీసులు అర్చకులుగా మారి డ్రెస్ కోడ్ ధరించడం ఏంటని అన్నారు. వెంటనే ఈ రకంగా ఆదేశాలు ఇచ్చిన అధికారిని తొలుత సస్పెండ్ చేయాలన్నారు. ఒక వేళ ఇలాంటి డ్రెస్ కోడ్ లో మోసగాళ్లు అమాయక భక్తులను మోసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. అటు సోషల్ మీడియాలో కూడ కొందరు దీనిపై అభ్యందరం వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు వారణాసి పోలీసు బాస్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. ఇలాంటి డ్రెస్ కోడ్ లో ఉంటే భక్తులు తొందరగా, వారి మాటలు వింటార్నారు. దీంతో రద్దీని ఈజీగా కంట్రోల్ చేయోచ్చని పోలీసు బాస్ క్లారిటీ ఇచ్చారు.