Gastritis Relief Remedies: గ్యాస్ సమస్య బాధిస్తోందా, ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు ఇట్టే మాయం

Gastritis Relief Remedies in Telugu: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అందులో ఒకటి కడుపు సంబంధిత సమస్య.  ఈ సమస్య కారణంగా దైనందిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుుతుంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి చాలా సులభంగా గట్టెక్కవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 29, 2024, 04:14 PM IST
Gastritis Relief Remedies: గ్యాస్ సమస్య బాధిస్తోందా, ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు ఇట్టే మాయం

Gastritis Relief Remedies in Telugu: ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ రుచిపరంగా అద్భుతంగా ఉండవచ్చు కానీ ఆరోగ్యపరంగా ఏ మాత్రం మంచిది కాదు. జీర్ణ సంబంధ సమస్యలకు మొదలవుతాయి. గ్యాస్, ఎసిడిటీకు దారి తీస్తుంది. ఈ సమస్యలు రోజువారీ జీవితాన్ని నరకప్రాయంగా మారుస్తాయి. అయితే దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం భోజనం చేసేటప్పుడు అంటే నోట్లో ఆహారం నమిలేటప్పుడు నోరు తెర్చి ఉంచకూడదు. అంటే బయటి గాలి నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఈ చిట్కా ద్వారా గ్యాస్ సమస్యను అరికట్టవచ్చు. ఇక కడుపులో గ్యాస్ పరిమితి దాటి ఉండే హాట్ వాటర్ బ్యాగ్ కడుపు దగ్గర పెట్టుకోవాలి. ఈ థెరపీ గ్యాస్ సమస్యను వెంటనే తగ్గించగలదు.

గ్యాస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల గ్యాస్ నియంత్రణలో ఉంటుంది. గ్యాస్ వెలువడటం, గ్యాస్ ఉత్పత్తి రెండూ ఆగుతాయి. గోరు వెచ్చని నీళ్లు జీర్ణక్రియను కూడా వేగవంతం చేస్తుంది. తద్వారా కడుపు హాయిగా ఉంటుంది. ఇక మరో చిట్కా యోగాసనం వేయడం. ఇందులో భాగంగా వజ్రాసనం మంచి ఫలితాలనిస్తుంది. గ్యాస్ సమస్యను దూరం చేసేందుకు వజ్రాసనం బెస్ట్ ఆప్షన్ అంటారు. రోజూ కనీసం 15 నిమిషాలు వజ్రాసనం వేస్తే చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

గ్యాస్ సమస్య అనేది ఎంత సింపుల్‌గా కన్పిస్తుందో అంత ప్రమాదకరం. ఈ సమస్యను సకాలంలో గుర్తించి వెంటనే పరిష్కరించవచ్చు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇదే సమస్య ప్రాణాంతకంగా మారగలదు. అంటే గ్యాస్ సమస్య అధికమైతే అది కాస్తా రిఫ్లక్స్ కావచ్చు. ఇది ప్రమాదకర స్థాయిని సూచిస్తుంది. 

Also read: Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News