వరద బాధిత కుటుంబాలకు రూ.5 వేల ఆర్ధిక సాయం !!

గోదవరి ఉగ్రరూపం దాల్చడంలో ఉభయ గోదావరి జిల్లాల వాసులు వదరలతో కొట్టుమిట్టాడుతున్నారు.

Last Updated : Aug 8, 2019, 05:29 PM IST
వరద బాధిత కుటుంబాలకు రూ.5 వేల ఆర్ధిక సాయం !!

తూ.గో: గోదావరి ఉగ్రరూపంలో దాల్చడంతో నదీపరివాహక ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఉభయ గోదావది జిల్లాల్లోని  వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా పరిస్థితులను అడిగి తెలుసుకున్న జగన్.. బాధిత కుటుంబాలకు రూ.5 వేలు ఆర్ధిక సాయం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ముంపు బాధిత ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. 

గోదావరి ఉగ్రరూపం దాల్చడంలో ఉభయ గోదావరి జిల్లాల వాసులు వదరలతో కొట్టుమిట్టాడుతున్నారు. వదర భీభత్సంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురైయ్యారు. ఇందులో  దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో వదర ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ సీఎం జగన్ ఈ మేరకు పునరావస ఏర్పాట్లతో పాటు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించారు

Trending News