సౌతాఫ్రికాతో జరిగే టి 20 సిరీస్ భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ ప్రకటించిన జాబితాలో ఎంఎస్ ధోనీకి లేకపోవడం గమనార్హం. అతని స్థానం ఫాంలో ఉన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఛాన్స్ ఇచ్చారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంఎస్ ధోనీకి సెలక్టర్లు అవకాశం కల్పించలేదని తెలుస్తోంది .
ఇదిలా ఉంటే వరల్డ్ తర్వాత విండీస్ టూర్ కు విశ్రాంతి తీసుకున్న హార్డిక్ పాండ్యా మళ్లీ జట్టులో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్కు టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. యువ ఫేసర్లు ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనిలకు పేస్ బౌలింగ్ బాధ్యతలు అప్పగించారు. బీసీసీఐ ప్రకటించిన 14 మంది జట్టు సభ్యులను ఒక్కసారి పరిశీలిద్దాం..
భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)
శిఖర్ ధావన్
కేఎల్ రాహుల్
శ్రేయస్ అయ్యర్
మనీష్ పాండే
రిషభ్ పంత్(వికెట్ కీపర్)
హర్దిక్ పాండ్య
రవీంద్ర జడేజా
కృనాల్ పాండ్య
వాషింగ్టన్ సుందర్
రాహుల్ చాహర్
ఖలీల్ అహ్మద్
దీపక్ చాహర్
నవదీప్ సైని.