The Legend Of Prince Ram: "ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్" 31 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం.. ఎప్పుడుంటే..?

The Legend Of Prince Ram Re-release: రామాయణం ఆధారంగా రూపొందించిన అద్భుతమైన యానిమేషన్ చిత్రం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ తిరిగి తెరపైకి వచ్చింది. 2024 అక్టోబర్ 18న తిరిగి విడుదల కానుంది. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 29, 2024, 11:21 AM IST
The Legend Of Prince Ram: "ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్"  31  ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం.. ఎప్పుడుంటే..?

The Legend Of Prince Ram Re-Release: "ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్" సినిమా 31 సంవత్సరాల తర్వాత భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.  ఈ యానిమేషన్‌ చిత్రాని తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 18న భారతీయ థియేటర్లలోకి ఈ సినిమా తెరపైకి రానుంది. దీ లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ్‌ ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత మన దేశంలో విడదుల కానుంది..? ఈ యానిమేషన్‌ను ఎప్పుడు విడుదల చేశారు అనే విషయాలు తెలుసుకుందాం. 

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ యానిమేషన్ మన భారతీయ మహాకావ్యం రామాయణం ఆధారంగా తయారు చేసిన ఒక అనిమే చిత్రం. ఈ చిత్రాన్ని జపాన్ నిర్మాత యుగో సాకో, భారత్ నిర్మాత రామ్‌ మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని 1993లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రేక్షకులను అంతగానో ఆకట్టుకుంది.  ఈ చిత్రం కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా, పెద్దలకు కూడా నచ్చేలా ఉంటుంది. ఈ యానిమేషన్‌  చిత్రం మంచి విలువలను నేర్పుతుంది. అలాగే భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 
 
అయితే ఈ చిత్రం  క్రాస్-కల్చరల్ సహకారం రామాయణాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని విదేశీ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు. అయితే ఇది భారతదేశంలో కొంత వివాదాన్ని కూడా సృష్టించింది. కారణం భారతీయ ఇతిహాసాన్ని విదేశీ చిత్ర నిర్మాతలు తమ దృక్పథంలో చిత్రీకరించడం కొంతమంది నచ్చలేదని విశ్వసనీయ సమాచారం. మరి కొందరు ఈ చిత్రం భారతీయ సంస్కృతిని సరిగ్గా ప్రతిబింబించలేదని భావించారు.

ఎందుకు మళ్ళీ రీ-రిలీజ్ :

ఇది పిల్లలు, యువతలో రామాయణం పట్ల ఆసక్తిని పెంచింది. అంతేకాకుండా రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడంలో కూడా ఎంతో సహాయపడింది. బ్రయాన్ క్రాన్స్టన్ ,  జేమ్స్ ఎర్ల్ జోన్స్ లాంటి ప్రముఖ హాలీవుడ్ నటుల గాత్రదానం చిత్రానికి మరింత గ్లామర్‌ని చేర్చింది. వీరితో పాటు అరుణ్ గోవిల్,  అమ్రిష్ పూరి వంటి భారతీయ నటుల స్వరాలు హిందీ ప్రేక్షకులకు మరింత అనుబంధాన్ని కలిగించాయి. అందుకే ఈ చిత్రానికి ఎక్కువ డిమాండ్‌ ఉందని కాబట్టి దీని రీ-రిలీజ్ చేస్తున్నారు. 

దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ్ చిత్రం విడుదల కావడం ఎంతో అనిమే లవర్స్‌ ఆనందానికి హద్దులు లేవని చెప్పవచ్చు. అలాగే గీక్ పిక్చర్స్ ఇండియా, AA ఫిల్మ్స్ , ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఈ చిత్రాన్ని భారతదేశం అంతటా విడుదల చేయడం ద్వారా దీనికి మరింత ప్రాచుర్యం లభించే అవకాశం ఉంది. ఈ  పౌరాణిక కథ ఆధారంగా రూపొందిన యానిమేషన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News