Oats Uttapam Recipe: ప్రస్తుత కాలంలో చాలా మంది ఆహార ఎంపికల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలని చాల మంది ఓట్సను ఉపయోగిస్తుంటారు. అయితే ఓట్స్‌ను పాలతో కలిపి తింటుంటారు.. కానీ ఓట్స్‌తో ఊతప్పం కూడా తయారు చేయవచ్చని తెలుసా..? దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఓట్స్ ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. దీంతో శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. అయితే రోజు ఒకే రకమైన ఓట్స్ తిని విసుగు చెందారా.. అయితే ఈ ఊతప్పంను ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు:
ఓట్స్: 1 కప్పు
పెరుగు: 1/2 కప్పు
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగినది)
కారం: రుచికి తగినంత
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
నీరు: అవసరమైనంత
నూనె: వేయించడానికి
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఓట్స్‌ను తీసుకొని, దానిపై తగినంత నీరు పోసి 15-20 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన ఓట్స్‌ను మిక్సీలో కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, దీనిలో పెరుగు, ఉల్లిపాయ, కారం, కొత్తిమీర, ఉప్పు వంటివి కలిపి బాగా కలపాలి. బ్యాటర్ పలుచగా లేదా గట్టిగా ఉండకుండా, మీకు నచ్చిన స్థిరత్వంలో ఉండేలా చూసుకోవాలి. తవాను వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. తర్వాత ఈ బ్యాటర్‌ను వడకట్టి తవాపై వృత్తాకారంలో పోసి, మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేడివేడి ఓట్స్ ఊతప్పాన్ని చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయండి.
ట్రై చేయండి ఈ వేరియేషన్స్:
బ్యాటర్లో క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం వంటి కూరగాయలను చిన్న ముక్కలుగా చేసి కలిపితే రుచి మరింతగా ఉంటుంది. వేయించేటప్పుడు పైనుండి కొద్దిగా చీజ్ చల్లుకోవచ్చు.
బ్యాటర్లో పనీర్ ముక్కలను కలిపి చేయవచ్చు.
ఓట్స్ ఊతప్పం ఆరోగ్యలాభాల:
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్థకం కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ ఊతప్పం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Buttermilk Hidden Facts: రోజు మజ్జిగ తాగితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.