KTR Election Results: చాపర్లు.. బ్యాగులు మోసినా ఘోర వైఫల్యం.. ఇకనైనా రేవంత్‌ రెడ్డి పద్ధతి మార్చుకో

KT Rama Rao Reacts Latest Election Results: దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌లను విమర్శలు చేస్తూనే రేవంత్‌ రెడ్డికి భారీ ఝలక్‌ ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 23, 2024, 03:34 PM IST
KTR Election Results: చాపర్లు.. బ్యాగులు మోసినా ఘోర వైఫల్యం.. ఇకనైనా రేవంత్‌ రెడ్డి పద్ధతి మార్చుకో

Election Results: 'నేటి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. ప్రాంతీయ పార్టీలు ఎల్లప్పుడూ భారత రాజకీయాల భవిష్యత్తుగా ఉన్నాయి. దాన్ని కొనసాగిస్తాయి' అని కేటీఆర్‌ తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించడంలో విఫలమైందని కేటీఆర్‌ తెలిపారు. విఫలమవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ తలమునకలవుతోందని మడిపడ్డారు. ఇది పునరావృతమయ్యే అంశంగా మారిందని పేర్కొన్నారు.

ఇది చదవండి: Maharashtra Results: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే కూలుస్తారు.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

 

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా ఆయా రాష్ట్రాల్లో అధికార కూటములకే మరోసారి అధికారం దక్కిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నా ఒరిగిందేమీ లేదని.. మరోసారి ప్రాంతీయ పార్టీల అవసరాన్ని తాజా ఫలితాలు గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇది చదవండి: KTR Harish Rao: సాయిరెడ్డి ఆత్మహత్య రేవంత్‌ రెడ్డి చేసిన హత్య: కేటీఆర్‌, హరీశ్ రావు

'కాంగ్రెస్ అసమర్థత. దాని అసమర్థత వల్లనే బీజేపీ మనుగడ సాగిస్తోందని నేను పునరుద్ఘాటిస్తున్నా' అని కేటీఆర్‌ ప్రకటించారు. ప్రాంతీయ పార్టీల కృషి.. నిబద్ధతపై రెండు జాతీయ పార్టీలు సిగ్గులేకుండా దుమ్మెత్తి పోస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ ఓ సలహా ఇచ్చారు. 'మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్‌లు మీ పార్టీని ఘోర వైఫల్యం నుంచి కాపాడలేకపోయాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించాలి' అని హితవు పలికారు. 'ఏడాది కిందట తెలంగాణ ప్రజలకు మీరు వాగ్దానం చేసిన ఆరు హామీలను అందించగలరా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి, మంత్రులు మొత్తం ప్రచారంలో మునిగారు. అంత కష్టపడి ఎన్నికల ప్రాంతాల్లో తిరిగినా ఫలితాలు చేదు ఫలితం ఏర్పడింది. మంత్రివర్గమంతా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. గురుకులాల్లో కలుషిత ఆహారం.. లగచర్లలో రైతుల పోరాటం వంటివి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలిచాయి. శాంతి భద్రతలు లోపించడంతో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News