Sprouts Winter Benefits: మొలకలు రోజు తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ A, C, E, K, B1, B6 వంటి అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా మొలకల్లో సమృద్ధిగా లభిస్తాయి. మొలకల్లో అధిక మోతాదులో ప్రోటీన్‌ను కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి రోజు తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. చలికాలం ప్రతి రోజు మొలకలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
మొలకలలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో జీవక్రియకు కావాల్సిన ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. చలికాలం రోజు తినడం వల్ల పోషకాల లోపం నుంచి విముక్తి పొందవచ్చు.
గుండె ఆరోగ్యానికి:
మొలకలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి. ఇవి రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నాయి. దీంతో పాటు ఇందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుదల:
మొలకలలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది రోగ నిరోధక శక్తి పెంచేందుకు సమాయపడుతుంది. అంతేకాకుండా చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బాడీని రక్షించేందుకు సహాయపడుతుంది.
శక్తిని అందిస్తాయి:
ప్రతి రోజు మొలకలు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన శక్తిని అందించి, అలసటను తగ్గించేందుకు ఎంతో సహాయడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చర్మం ఆరోగ్యానికి మంచిది:
మొలకలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు వంటి సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చలికాలంలో మొలకలు తినండి.
కంటి ఆరోగ్యానికి మంచిది:
మొలకలలో విటమిన్ ఎ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవేకాకుండా వివిధ రకాల క్యాన్సర్ల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.