Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?

Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
 

1 /6

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. దీనిలో ఎన్డీయే  తన మార్కు చూపించిందని చెప్పవచ్చు. మరోవైపు మహాయూతి.. మహా వికాస్ అఘాడినీ మట్టి కరిపించింది.

2 /6

మరాఠా గడ్డమీద తొలిసారి బీజేపీ 90 శాతం స్ట్రైయిక్ రేటును సాధించింది. ఇదిలా ఉండగా.. మహా ఎన్నికలలో ఎన్డీయే తరపున ప్రచారంకు తెలుగు స్టేట్స్ నుంచి పలువురు నేతలు వెళ్లారు. వీరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. 

3 /6

పవన్ ముఖ్యంగా..మహాయుతికి మద్దతుగా.. డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని మూడు స్థానాలు, బల్లార్ పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్ పూర్, కస్బాపేట్ నియోజకవర్గాలలోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు సభల్లో పాల్గొన్నారు. అనేక రోడ్ షోలు సైతం నిర్వహించారు.   

4 /6

ఇక్కడ పవన్ కళ్యాణ్.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్, ఛత్రపతీ శివాజీ, జిజియాబాయి, బాల్ ఠాక్రెల గురించి కూడా తన ప్రసంగంలో స్మరించుకున్నారు. మహారాష్ట్ర పునర్నిర్మాణంలో వీరి పాత్రను కొనియాడారు. అంతే కాకుండా.. పవన్ మరాఠిలో మాట్లాడి అక్కడి వాళ్ల మనస్సులు గెలుచుకున్నారని చెప్పవచ్చు. అదే విధంగా సనాతన ధర్మం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

5 /6

ముఖ్యంగా.. లాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం చెప్పుకొదగ్గ విషయం. ఇదిలా ఉండగా.. ఒక పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో..  100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా బీజేపీ రికార్డులకు ఎక్కినట్లు తెలుస్తొంది. శివాజీ మహారాజ్  మాదిరిగా పవన్ ఫ్లెక్సీలు మరాఠ గడ్డమీద వెలిసిన విషయం తెలిసిందే.

6 /6

మరోవైపు పవన్ కళ్యాన్.. కొన్నినెలల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికలలో సైతం..100 శాతం స్ట్రైక్ రేటును సాధించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో అన్నింటా విజయం సాధించి జనసేన పార్టీ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.