Gold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు. వెండి ధర ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
Gold And Silver Rates Today: దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు గురువారం స్వల్పంగా పెరిగింది. ఇక బంగారం ధరలు భారీగా తగ్గుతాయని భావించిన వారికి ఈ పెరుగుదల మరోసారి షాకిచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలను చూసిన బంగారం ప్రియులు భవిష్యత్తులో మరింత తగ్గుతుందని ఆశించారు.
నాలుగు రోజుల్లో దాదాపు 4వేల రూపాయల వరకు పడిపోయింది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుదల సాధారణమే అయినప్పటికీ..ఒక స్థాయిలో 80వేల దాటి లక్ష చేరువైన బంగారం ధర ఉన్నట్టుండి తగ్గడం ప్రారంభించింది. దీంతో బంగారం ప్రియులు మరింత తగ్గి 60వేలకు తులం పడిపోతుందని భావించారు. కానీ నేడు బంగారం ధర పెరగడంలో వారిలో ఆందోళన మళ్లీ మొదలైంది.
దేశంలో బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 600 పెరిగింది. దీంతో 78,800కు చేరుకుంది. కిలో వెండి ధర రూ. 5,200 పెరిగింది. దీంతో 95,800కు చేరుకుంది. వెండి ధర ఒక రోజులో ఇంత పెరిగడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర రూ. 1.02శాతం పెరిగింది. దీంతో 2,673 డాలర్లకు చేరుకుంది. వెండి 30. 94డాలర్లకు చేరుకుంది.
బంగారం హెచ్చుతగ్గులకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో బంగారం ధరలు భారీగా తగ్గడం తోపాటు ప్రస్తుతం ఒఖ ఔన్సు 2670డాలర్లుగా ఉంది. గతంతో పోల్చితే బంగారం ధర దాదాపు 80 డాలర్ల వరకు తగ్గింది.
బంగారం ధరలు ప్రధానంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో భారీగా తగ్గాయి. ముఖ్యంగా పసిడి ధరలు తగ్గడానికి అసలు కారణం పెద్ద మొత్తంలో అమెరికాలో స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వెళ్లడం ఒక కారణం అయితే డాలర్ బలంగా మారడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు.
సాధారణంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా డాలర్ బలపడటం కూడా కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే అమెరికా డాలర్ బలపడినప్పుడు అమెరికా బాండ్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాదు బంగారం నుంచి తమ ఇన్వెస్ట్ తగ్గించుకుంటారు.
అయితే బంగారం ధరలు ఫిబ్రవరిలో తగ్గి అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అధ్యక్ష పదవిలో బాధ్యతలు పూర్తి స్థాయిలో ట్రంప్ చేపడతారు. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం నుంచి స్టాక్ మార్కెట్ల వైపు పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.