School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. డిసెంబర్‌ నెలలో స్కూళ్లకు సెలవులు ఎన్నో తెలుసా?

School Holidays In December: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త. స్కూళ్లకు భారీ మొత్తంలో సెలవులు రానున్నాయి. నవంబర్‌ మాసం గడిచిపోయింది. డిసెంబర్‌ నెలలో ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. అంతేకాదు దసరా సందర్భంగా దాదాపు 13 రోజులు సెలవులు వచ్చాయి.  

2 /6

అంతేకాదు దీపావళి సందర్భంగా మరో రెండు రోజులు కొన్ని స్కూళ్లకు సెలవులు మంజూరు చేశారు. రెండు నెలలుగా స్కూళ్లకు భారీగా సెలవులు వస్తున్నాయి. అయితే, డిసెంబర్‌ నెలలో కూడా విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త అని చెప్పాలి.  

3 /6

డిసెంబర్‌ నెలలో విద్యార్థులకు దాదాపు 9 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాత పండుగ అయిన క్రిస్మస్‌ రెండు రోజులు సెలవులు ఇవ్వనున్నారు. ఇక మిషనరీ స్కూళ్లకు అదనంగా మొత్తం వారం రోజులు ప్రతి ఏటా ఇస్తున్నారు.  

4 /6

ఇక మిగతా ఆదివారం, రెండో శనివారం ఉండనే ఉన్నాయి. డిసెంబర్‌ 6వ తేదీ కూడా కొన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ఇది కాకుండా వర్షాల నేపథ్యంలో ప్రాంతాలను బట్టి స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు.  

5 /6

నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్నా తుఫాను నేపథ్యంలో కూడా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని ఐఎండీ సూచించింది.  

6 /6

దీంతో నేటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ఇవ్వచ్చు. ఇదిలా ఉండగా 2025 జనవరి నెలలో సంక్రాంతి సెలవులు కూడా భారీగానే ఉండనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నాయి.