Komatireddy Venkat Reddy: బూస్ట్ తాగుతూ.. విటమిన్స్ తింటూ.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్

Minister Komatireddy Venkat Reddy: కేసీఆర్ బూస్ట్ తాగుతూ.. విటమిన్స్ తింటూ తెలంగాణ కోసం దీక్ష చేసి త్యాగం చేసినట్లు సీన్ క్రియేట్ చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. తాను నల్గొండలో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినా.. ఎప్పుడు ఇలా ప్రచారం చేసుకోలేదన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 29, 2024, 03:54 PM IST
Komatireddy Venkat Reddy: బూస్ట్ తాగుతూ.. విటమిన్స్ తింటూ.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్

Minister Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకి ఇవ్వలేదని విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా రాంరెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతామని చెప్పి కూలిపోయే కూళేశ్వరం కట్టిండని ఫైర్ అయ్యారు. 30 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకున్నామని.. గంగారాం బ్రిడ్జ్ కట్టాలని ఎమ్మెల్యే అడిగారు.. దాన్ని ఇప్పుడే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రతీ ఆర్ అండ్ బీ రోడ్లను అభివృద్ధి చేసి ప్రజల అభిమానం చురగొంటామన్నారు.

Also Read: Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్‌చల్‌

"ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే బావ బామ్మర్ది ప్రజా ప్రభుత్వం పడిపోతాది అంటరు. ఇందాక ఎక్కడోకాయన కేసీఆర్ బొమ్మ పెట్టి దిక్షా దివాస్ అని పోస్టర్ చుసిన.. నవ్వాల్నో ఏడవాల్నో అర్ధం కాలే.. అయన గ్లూకోజులు, విటమిన్స్ తీసుకుంటూ చేసిన దీక్షకు కూడా ఇంత బిల్డప్ ఇస్తే ప్రజలు నవ్వుకుంటరని అనుకోవాలె కదా.. కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోనె ప్రకాష్ రావుని అడిగితే కుల్లం కుల్ల చెప్తడు. కానిస్టేబుల్ కిష్టయ్యది, శ్రీకాంతాచారిది నిజమైన త్యాగం. కేసీఆర్‌దిది నకిలీ దీక్ష. బూస్ట్ తాగుతూ, సెలైన్లు, విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతో తెలంగాణ వచ్చింది. నేను నల్గొండ చౌరాస్తలో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశా. ఇట్ల ఎప్పుడు ప్రచారం చేసుకోలే. మూడేండ్లు మంత్రి పదవి ఉండగా రాజీనామా చేశా. ఇప్పుడు ఏపీలో మా పార్టీకి ఒక్క వార్డ్ మెంబర్ కూడా లేడు.

సంక్రాంతికి ఎకరాకు 7 వేల చొప్పున రైతు భరోసా వేస్తాం. ఇప్పటికే 22 లక్షల మంది ఖాతాల్లో 18 వేల కోట్లు జమ చేసినం. పేదవారి పిల్లలకి అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ⁠ఆరోగ్యశ్రీ ని 10 లక్షల కు పెంచి 90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చుతున్నాం. కొంచెం ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా కూడా ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం." అని మంత్రి కోమటరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.   

Also Read: EPFO: ఏటీఎం తరహా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు..పూర్తి వివరాలివే   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News