Honda Amaze: హోండా నుంచి కొత్త అమేజ్ డిసెంబర్ 4న భారతదేశంలో విడుదల కానుంది. అమేజ్ పూర్తిగా కొత్త డిజైన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. అందుకే ఇప్పుడు మినీ హోండా సిటీ అని పిలుస్తున్నారు. కొత్త అమేజ్ కారుకు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే ఎన్నో లీకులు ద్వారా బయటకు వచ్చాయి. ఈసారి కొత్త హోండా అమేజ్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
కొత్త హోండా అమేజ్ లాంచ్‌కు ముందే మరోసారి ఫీచర్లు లీకయ్యాయి. ఈసారి ఇది కొత్త రంగులో కనిపించింది. ఇది ప్రస్తుత మోడల్ లాగా రేడియంట్ రెడ్ మెటాలిక్ లో ఉంది. ఈ హోండా అమేజ్ కారు ఫ్రంట్ సైడ్ న్యూ హెడ్ లైట్స్, బంపర్ అమర్చారు. బోనెట్ మాత్రం ప్రస్తుత మోడల్లో ఉన్నట్లుగానే కనిపించింది. ప్రస్తుత మోడల్ కంటే పెద్ద గ్రిల్ ను ఈ కారులో పెట్టారు. కారు లోపల కొత్త సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ను వాడారు. అలాగే రియర్ ఏసీ వెంట్ కూడా పెట్టారు. ఈ లేటెస్టు కారులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా ఉంది. అయితే ఇందులో 360 డిగ్రీ కెమెరా మాత్రం మిస్ అయినట్లు ఫీచర్లను బట్టి చూస్తే అర్థమవుతుంది.
Also Read: KTR Break: 'నేను రెస్ట్ తీసుకుంటా.. ఇక చెల్లి, బావ మీరు తగులుకోరి': కేటీఆర్
ఈ లేటెస్ట్ అమేజ్ కారులో 1.2 లీటర్ ఫోర్ సిలిండర్, పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఇది 89 బీహెచ్ పిపవర్, 110 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుందని తెలుస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అనుసంధానమై పనిచేస్తుంది ఈ కారు. హోండా కంపనీ ఇండియాలో డీజిల్ ఇంజిన్ కార్లను క్రమంగా తగ్గిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. కాబట్టి కొత్త అమేజ్ కారు కేవలం పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే లభిస్తోంది.
ఈ న్యూ హోండా అమేజ్ కారు ధర సుమారుగా రూ. 7.29లక్షల నుంచి రూ. 10.05లక్షల వరకు ఉంటుందని సమాచారం.
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter