Ind vs Aus 2nd Test: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 సమమైంది. రెండో టెస్ట్ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ర్యాంకు కష్టంగా మారింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 180 పరుగులకు ఆలవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 36.5 ఓవర్లకే 175 పరుగులకు ఆలౌట్ అయింది. 18 పరుగుల స్వల్ప లీడ్ అధిగమించేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది.
భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత శుభమన్ గిల్ 28 పరుగులు, రిషభ్ పంత్ 28 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు, బోలాండ్ 3 వికెట్లతో ఇండియా జట్టును కుప్పకూల్చారు. ట్రావిస్ హెడ్ 140 పరుగులతో అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. టీమ్ ఇండియా బౌలర్లలో బూమ్రా, సిరాజ్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు.
Also read: 8th Pay Commission Date: 8వ వేతన సంఘంపై క్లారిటీ వచ్చేసింది, అదిరిపోయేలా పెరగనున్న జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.