Mohan Babu:మోహన్ బాబు తలకు గాయం.. ఐసీయూలో చికిత్స..

Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకొని బజారున పడ్డాయి.ఈ నేపథ్యంలో  మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  బుధవారం ఉదయం పదిన్నర గంటలకు కమిషనరేట్‌లో విచారణకు హాజరు రావాలని సీపీ ఆదేశించారు. మరోవైపు మోహన్ బాబుకు తలకు గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 11, 2024, 08:34 AM IST
Mohan Babu:మోహన్ బాబు తలకు గాయం.. ఐసీయూలో చికిత్స..

Mohan Babu: మంచు ఫ్యామిలీలో గొడవలు మంచు కరికినట్టు  ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతేకాదు మోహన్ బాబు,  మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకులను కూడా సరెండర్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. మరోవైపు ఈ గొడవలో మోహన్ బాబు  మీడియాపై అత్యుత్సాహాం ప్రదర్శించారు. వారిపై దాడి చేసారు. దీనిపై జర్నలిస్టు సంఘాలతో పాటు పలువురు రాజకీయ నాయకులు  ఖండించారు. మరోవైపు ఈ ఘటనలో మోహన్ బాబు కాస్త సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం  నటుడు మోహన్‌బాబు ఆరోగ్యం నిలకడగా వున్నట్టు సమాచారం. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన హైడ్రామాతో మోహన్‌బాబు  ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరింది.

మనోజ్‌తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు, కాలుకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను మంచు విష్ణు.. కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అంతకు ముందు  మంచు మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అయితే.. వారిని లోపలికి రానివ్వలేదు.  లోపల తన కూతురు ఉందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు.

ఎంతకూ తీయకపోవటంతో..  తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో.. లోపల మనోజ్‌కు, మోహన్ బాబుకు తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్‌బాబు  మీడియా ప్రతినిధులపై  దాడికి దిగారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధి  గాయంతో ఆసుపత్రిపాలయ్యారు.  

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News