YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు

YCP India Alliance: దేశంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారుతున్నాయి. మారబోతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి పార్టీలు అటూ ఇటూ అవుతున్నాయి. కాంగ్రెస్ బద్ధ శత్రువైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చెంతకు చేరనుందా అంటే అవుననే సమాధానం విన్ఫిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2024, 03:08 PM IST
YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు

YCP India Alliance: 2024లో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కన్పిస్తోంది. కాంగ్రెస్ అంటే పడని ఆ పార్టీ అధినేతలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమికి సారధ్యం ఎవరనే ప్రశ్న దేశవ్యాప్తంగా విన్పిస్తున్న నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చర్చనీయాంశమౌతోంది. 

దేశంలో విపక్ష ఇండియా కూటమికి సారధ్యం ఎవరనే ప్రశ్న గత కొద్దికాలంగా విన్పిస్తోంది. దీనికి సమాధానంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పేరు తెరపైకి వచ్చింది. మమతా బెనర్జీకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయాన్ని ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, ఉద్ధవ్ శివసేన, ఆర్జేడీ పార్టీలు వ్యక్తం చేయగా తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇందుకు ఉదాహరణ. మమతా బెనర్జీ రాజకీయ అనుభవం, నాయకత్వ పటిమ, సొంత రాష్ట్రంలో బీజేపీని మట్టికరిపించిన తీరు మమతాకు ప్రత్యేక లక్షణాలని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో లేదు. గత ఎన్నికల సమయంలో అంటే 2019 నుంచి 2024 వరకూ బీజేపీ సాన్నిహత్యంగా ఉంది. ఎన్డీయేలో లేకపోయినా బీజేపీ ప్రభుత్వానికి అన్ని విషయాల్లో అండగా నిలిచింది. కానీ 2024 ఎన్నికల్లో ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు, తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఏకమై అధికారంలో రావడంతో వైసీపీ ప్రాధాన్యత మారింది. ఇటీవలి పరిణామాలు కొద్దిగా కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇండియా కూటమిలో చేరితో వైసీపీకు రాజకీయంగా మంచి ఫలితాలుండవచ్చని విశ్లేషకుల అంచనా. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ముఖ్యంగా వైఎస్ షర్మిల ప్రభావాన్ని తగ్గించవచ్చనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరుని సమర్ధించడం ద్వారా ఇండియా కూటమికి అనుకూలమనే పరోక్ష సంకేతాలు విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా బహిర్గతమయ్యాయి. 

Also read: AP Politics: ఆర్ కృష్ణయ్య అవకాశవాద రాజకీయంపై విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News