Good News for Home Loan Borrowers: ఆర్బిఐ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఆర్బీఐ డిసెంబర్ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2025 నాటికి రెపోరేటును తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది హోంలోన్స్ ఈఎంఐ భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Good News for Home Loan Borrowers: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆర్బిఐ ద్రవ్య విధాన సమీక్ష కారణంగా హోంలోన్స్ EMIలను తగ్గించడంలో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనియన్ బడ్జెట్ 2025-26 సమర్పణ తర్వాత షెడ్యూల్ చేసిన ఫిబ్రవరి మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటుగా పిలిచే కీలక వడ్డీ రేటును కనీసం 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్, జూన్, ఆగస్టు , అక్టోబర్, డిసెంబర్ 2025లో 6 మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో కనీసం 4 సమావేశాల్లో సెంట్రల్ బ్యాంకు రెపోరేటును తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 100 బేసిస్ పాయింట్స్ కోత కోసం ప్రతిసారి 25బేసిస్ పాయింట్లను తగ్గిస్తారు. ఆర్బిఐ ఈ 100 బేసిస్ పాయింట్ రెపోరేటు తగ్గించడం వల్ల రుణగ్రహీతలకు భారీ ఉపశమనం లభిస్తుంది. లోన్స్ మరింత తగ్గించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాలని భావిస్తున్నారు.
డిసెంబర్ 6వ తేదీన జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో, రిజర్వ్ బ్యాంక్ బెంచ్ మార్క్ రేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దాని రేట్లను 11వ సారి యథాతథంగా ఉంచింది.
RBI తన డిసెంబర్ సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచినప్పటికీ, 2025కి రేటు తగ్గించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక హెచ్ఎస్ బీసీ రీసెర్చ్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో 6శాతం నుండి 25 bps చొప్పున తగ్గించవచ్చు.ఇక జపనీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన నోమురా 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఇండియా రేటును 100 బీపీఎస్ వరకు తగ్గించాలని భావిస్తోంది. ఇది రుణగ్రహీతలకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రస్తుతం, ప్రధాన బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను 9.75శాతం వరకు వసూలు చేస్తాయి. RBI రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించినట్లయితే, అది రుణగ్రహీతలకు గణనీయమైన పొదుపుకు దారి తీస్తుంది.
ఉదాహరణకు, గృహ రుణగ్రహీత రూ. 50 లక్షలు తీసుకునే లోన్ పై 9.25శాతం వడ్డీ రేటుతో నెలకు రూ. 45,793 EMI చెల్లిస్తారు. రేటు 1 శాతం తగ్గితే, వారి నెలలవారీ వాయిదా రూ. 42,603కి పడిపోతుంది. దీనివల్ల నెలకు 3190 రూపాయలు ఆదా అవుతుంది.